నాగబాబుకు మంత్రి పదవి వేళ ఊహించని రాజకీయం, భారీ మార్పులు..!?
ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. వైసీపీ ముఖ్య నేతలకు కేసుల ఉచ్చు బిగుస్తోంది. జగన్ సైతం లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో పాలనా పరంగా కీలక నిర్ణయాలకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటుగా మంత్రుల విషయంలోనూ ఊహించి నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. నాగబాబు మంత్రిగా చేరిక పైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
కీలక సమీకరణాలు
ఏపీ ప్రభుత్వంలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల కూటమి ప్రభు త్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది. దీంతో, రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తరువాత మంత్రివర్గంలోకి తీసుకోవా లని నిర్ణయించారు. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడనేది స్పష్టత రావటం లేదు. ఇదే సమయంలో ఏడాది పాలన సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పని తీరు పై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మారుతున్న లెక్కలు
కూటమి పాలన.. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో మార్పులకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకు ఇవ్వం పైనా కొత్త చర్చ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా నాగబాబుకే మంత్రి పదవి ఇవ్వాలా.. లేక, జనసేన కు చెందిన విశాఖ సీనియర్ నేత కొణతాలను మంత్రివర్గంలోకి తీసుకోవాలా అనే అంశం చర్చకు వచ్చినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. అయితే, నాగబాబుకు 2024 లో ఎంపీగా, ఆ తరువాత రాజ్యసభ కు అవకాశం మిస్ కావటంతో మంత్రి పదవి పైన ఇచ్చిన హామీకి అనుగుణంగా అవకాశం ఇవ్వా లనే ఆలోచనకే కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో మంత్రివర్గంలోనూ మార్పుల పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మార్పులు - చేర్పులు
ఏపీ కేబినెట్ లో కొందరు మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనాలకు తగినట్లుగా పని చేయటం లేదనే అభిప్రాయం ఉంది. దీంతో.. ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అందులో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమకు చెందిన మంత్రి పేరు ప్రచారం లో ఉంది. వారిని తప్పించినా.. ఎక్కడా సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా కూర్పు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొందరు మంత్రుల శాఖల మార్పు అనివార్యంగా మారుతోంది. కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రుల పని తీరు సమర్ధవంతంగా లేకపోవటంతో..వారి శాఖలు మార్పు ఖాయమని భావిస్తున్నారు. అయితే, ఏడాది కాలానికే మంత్రివర్గంలో మార్పులు చేస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. దీంతో, మంత్రివర్గం అంశంలో చంద్రబాబు నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే..












Click it and Unblock the Notifications