కొత్త జిల్లాలు..రెవిన్యూ డివిజన్లు ఫైనల్ - నియోజకవర్గాల్లో మార్పులు ఇలా..!!

ఏపీలో కొత్త జిల్లాలు... రెవిన్యూ డివిజన్ల పై ఒక స్పష్టత వచ్చింది. మంత్రివర్గ ఉప సంఘం సుదీర్ఘ కసరత్తు తరువాత కీలక ప్రతిపాదనలతో సిద్దమైంది. కొత్తగా రెండు జిల్లాలు.. ఏడు రెవిన్యూ డివిజన్ల తో పాటుగా పలు నియోజకవర్గాల సర్దుబాటు పైన చర్చించింది. ఈ నెల 10వ తేదీన జరిగే ఏపీ మంత్రివర్గ భేటీలో ఈ ప్రతిపాదనల పైన చర్చించనున్నారు. ఆ తరువాత ప్రజాభిప్రాయ సేకరణ చేసి.. అధికారికంగా ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. దీంతో.. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు పెరగనున్నాయి.

ఏపీలో కొత్త జిల్లాలపై స్పష్టత వచ్చింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లెను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.కొత్తగా రెండు జిల్లాలు, ఏడు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలనే ప్రతి పాదనలను పరిశీలించారు. దీని ప్రకారం... పీలేరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లతో 'మదనపల్లె జిల్లా'ను ఏర్పాటు చేసే అవకాశముంది.

Cabinet sub committee almost finalized the new districts and Revenue divisions proposals

ఇందులో మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు ఉండే అవకాశముంది. మదనపల్లె రాష్ట్రంలోనే అతిపెద్ద డివిజన్‌. కొత్తగా పీలేరును కూడా డివిజన్‌గా చేయాలన్న ప్రతిపాదన రెవెన్యూశాఖ నుంచే వచ్చింది. పలమనేరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు, చిత్తూరు డివిజన్‌లోని కొన్ని మండలాలతో కొత్తగా మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో సదుం, సోమల, చౌడేపల్లె, పుంగనూరు, రొంపిచర్ల, పులిచెర్ల మండలాలు ఉండనున్నాయి.

మదనపల్లెలోని 11 మండలాలు ఎలాగూ ఉంటాయి. ఇక రాయచోటి డివిజన్‌లోని 4 మండలాల ను (పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె) కొత్త జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. కాగా, కొన్ని నియోజకవర్గాలను పొరుగున ఉండే జిల్లాలో విలీనం దిశగా కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్‌ జిల్లాలో, కైకలూరు నియోజ కవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని ప్రతిపాదనల్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నట్లు తెలు స్తోంది.

ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం రెంటికి పైగా రెవెన్యూ డివిజన్లలో విస్తరించి ఉందని వివరించారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక రెవెన్యూ డివిజన్‌లోనే సర్దుబాటు చేసే లా నిర్ణయం జరిగింది. నగరి స్థానం పరిధిలోని రెండు మండలాలు తిరుపతిలో, మూడు మండలా లు చిత్తూరులో ఉన్నాయి. మొత్తం నగరిని తిరుపతి జిల్లా, రెవె న్యూ డివిజన్‌ పరిధిలోకి తీసుకురా వాలని నిర్ణయించినట్లు సమాచారం. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా 'మార్కాపురం జిల్లా' ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటి పై సీఎం చంద్రబాబుతో చర్చించి న తరువాత కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+