కాల్ మనీ వ్యాపారి సుబ్బారెడ్డి అరెస్టు: రోడ్డెక్కిన కాల్ మనీ బాధితులు
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ కాల్‌మనీ వ్యాపారి సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 1469 ప్రామిసరీ నోట్లు, 911 బ్లాంక్ చెక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 89 పాసు పుస్తకాలు, 53 ఏటీఎం కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో కాల్‌మనీ బాధితులు వీధికెక్కారు. న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. వడ్డీ వ్యాపారి శ్రీదేవి పట్ల పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. వేధింపులకు పాల్పడుతున్న శ్రీదేవి నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

వడ్డీ వ్యాపారి వేధింపులకు ఆత్మహత్యాయత్నం
అప్పు చెల్లించేందుకు సిద్ధపడినా వ్యాపారి సహకరించక పోవడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది. పట్టణంలోని 2వ వార్డు క్రిస్టియన్ పేటకు చెందిన వెంకటేశ్వరమ్మ స్థానిక పటేల్‌నగర్‌లో ఉంటున్న బొలిశెట్టి రమే్‌షబాబు వద్ద రూ.2 లక్షల అప్పు తీసుకున్నారు.
వెంకటేశ్వరమ్మకు చెందిన 4 సెంట్ల భూమిని తాకట్టు రిజిస్ట్రేషన్ చేయించారు. రెండు వాయిదాల వడ్డీ చెల్లించిన వెంకటేశ్వరమ్మ తర్వాత దాన్ని కట్టలేక పోయింది. దీంతో వడ్డీ వ్యాపారి 4 సెంట్ల భూమిని తనపేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే ఇటీవల వెంకటేశ్వరమ్మకు డబ్బు సమకూరింది.
దీంతో తీసుకున్న అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తాము తమ భూమి తమకు ఇవ్వమని రమే్‌షబాబును ప్రాథేయపడినా ఫలితం కనిపించ లేదు. దీంతో వెంకటేశ్వరమ్మ కుమార్తె మెట్టు శివపార్వతి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది.












Click it and Unblock the Notifications