వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు: లొంగుబాటులో నిందితులు?

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసులో పరారీలో ఉన్న నిందితులు పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నిందితులు వెనిగళ్ల శ్రీకాంత్, సత్యానందంతో పాటు మరో నిందితుడు పరారీలో ఉన్నారు. సత్యానందం కూడా విదేశాలకు పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వెనిగళ్ల శ్రీకాంత్‌ విదేశాల్లో ఉండగా కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో అతను అక్కడే ఉండిపోయాడని అంటున్నారు. ఈ విషయంపై తనపై వచ్చిన విమర్శలకు టిడిపి శాసనసభ్యుడు బోడె ప్రసాద్ సమాదానం ఇస్తూ - గంగిరెడ్డివంటి నిందితుడినే పోలీసులు అరెస్టు చేశారని, వెనిగళ్ల శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేస్తారని, లేదంటే అతను లొంగిపోతాడని శాసనసభలో చెప్పారు.

Call money case: Accused may surrender

వెనిగళ్ల శ్రీకాంత్‌తో పాటు బోడె ప్రసాద్ విదేశాలకు వెళ్లినట్లు, బోడె ప్రసాద్ తిరిగి రాగా శ్రీకాంత్ అక్కడే ఉండిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ స్థితిలో బోడె ప్రసాద్ ఆ విధంగా ఉన్నారు. కాగా, కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కోసం చేస్తున్న కొందరు నిందితులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

కస్టడీ విచారణలో నిందితుల నుంచి కేసుకు సంబంధించి మరిన్ని కీలక నిజాలు రాబట్టాలనే యోచనలో పోలీసులు ఉన్నారు. పటమట కేంద్రంగా కార్యాలయం నడుపుతూ అవసరమని వచ్చిన వారికి అప్పులిచ్చి అధిక వడ్డీలు గుంజుతూ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడి వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసుల అభియోగం.

ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు నగర పోలీసు కమిషనర్ ఆదేశాలతో టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి ఈ ముఠా గుట్టు రట్టుచేసిన విషయం తెలిసిందే.

English summary
It is said that the accused in call money sex rocket case may surrender soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X