వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్ మనీ కేసులో నిందితుడు సత్యానందానికి ముందస్తు బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసులో నిందితుడు సత్యానందానికి హైకోర్టు ముందస్లు బెయిల్‌ను మంజూరు చేసింది. మంగళవారంనాడు అతనికి బెయిల్ మంజూరైంది. కేసులో పోలీసుల దర్యాప్తునకు సంహకరించాలని సత్యానందానికి హైకోర్టు షరతు విధించింది.

విజయవాడలో కాల్‌మనీ వ్యవహారంలో వెలుగులోకి రావడంతో ఎలక్ట్రికల్ డీఈగా పనిచేస్తున్న సత్యానందంను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్‌కు గురైనప్పటికీ నుంచి సత్యానందం కనిపించకుండా పోయారు.

సత్యానందం విదేశాలకు పరారయ్యారా అనే కోణంలో బెజవాడ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, అతను ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడం, కోర్టు నుంచి దాన్ని పొందడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాల్‌మనీ కేసులో ఆయన పేరు బయటికి రాగానే పోలీసులు ఆయన పాస్‌పోర్టుని సీజ్ చేశారు.

Call money Case: Satyanandam gets anticipatory bail

ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు యలమంచిలి రాము, భవానీశంకర్, చెన్నుపాటి శ్రీను, ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీరు ఎం సత్యానందం, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ళ శ్రీకాంత్, దూడల రాజేష్‌లపై మాచవరం పోలీసులు చీటింగ్, అత్యాచారంతోపాటు పలు కేసులు నమోదు చేశారు. వీరిలో రాము, రాజేష్, భవానీశంకర్‌లను అరెస్టు చేశారు. ఆ తర్వాత రాము, రాజేష్‌లను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. దీనిలో భాగంగా నిందితులకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల పాటు వారిని విచారించారు.

కాల్ మనీ కేసులో ప్రధానంగా ట్రాన్స్‌కో డిఇ సత్యానందం కీలక పాత్ర వహించినట్లు, ఇతని ద్వారా పలువురు అధికారులు బినామీల కింద కోట్లు పెట్టుబడులు పెట్టి తద్వారా కాల్‌మనీపై వచ్చే ఆదాయంలో భారీగా వాటాలు పొందుతున్నట్లు తెలుస్తోంది.

స్తుతం ప్రభుత్వ అధికారిగా ఉన్న ఓ ప్రిన్సిపాల్‌కు డిఇ సత్యానందం ద్వారా ఈ రాకెట్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు తెర మీదకు వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాకెట్‌పై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో ముందుగానే పసిగట్టిన సత్యానందం పరారయ్యే క్రమంలో తన నలుపు రంగు కారును ఈప్రిన్సిపాల్‌కు ఇచ్చినట్లు అతని కారులో సత్యానందం తప్పించుకుని పోలీసులను దృష్టి మరల్చినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత సదరు ప్రిన్సిపాల్ నుంచి పోలీసులు నలుపు రంగు కారు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Accused in Call money case Satyanandam has been granted anticipatory bail from High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X