కాల్ మనీ-సెక్స్ రాకెట్‌పై జాతీయ మీడియాలో కథనాలు: చంద్రబాబుకు ఇబ్బందులేనా?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతున్న 'కాల్ మనీ - సెక్స్ రాకెట్' పైన ఆంగ్ల మీడియాలోను పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. తాజాగా, ప్రముఖ ఆంగ్ల మీడియా ఒకటి 'ఏపీలో కాల్ మనీ సెక్స్ రాకెట్ ఏమిటి - చంద్రబాబు ఎందుకు ఇబ్బందుల్లో పడ్డారు?' అంటూ ఓ కథనం వచ్చింది.

కాల్ మనీ రాకెట్ విషయంలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాగ్యుద్ధం రాజకీయ వేడిని రాజేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మీ పార్టీకి చెందిన వారు ఉన్నారంటే, మీ పార్టీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో జీ న్యూస్ పై ఆసక్తికర కథనాన్ని రాసింది. ఇళ్లు, ఇతర వస్తువులను తనఖా పెట్టుకుని ఒక్క ఫోన్ కాల్‌తో రుణాలు ఇచ్చే 'కాల్ మనీ' రాకెట్ వసూళ్లలో బరి తెగించిన వైనం పైన ఇందులో పేర్కొంది.

రుణ వసూళ్లలో దారుణంగా వ్యవహరించిన కాల్ మనీ నిర్వాహకులు మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగుతున్నారని, ఈ రాకెట్‌కు రాజకీయ నేతల మద్దతు కూడా ఉందని పేర్కొంది.

'Call money' sex racket: Is Chandrababu Naidu in trouble?

అధికార టిడిపికి చెందిన నేతలకే ఈ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయని విపక్షం విరుచుకుపడుతుందని, ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో న్యాయ విచారణకు ముందుకు వచ్చారని పేర్కొంది.

కాల్ మనీ రాకెట్‌లో పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నారని పోలీసులు చెప్పారని పేర్కొంది. ఇందుకు సంబంధించి పోలీసులు దాదాపు ఎనభై మందిని అరెస్టు చేసిందని పేర్కొంది.

కాల్ మనీ అంటే ఏమిటో కూడా ఇందులో పేర్కొంది. ఓ ఫోన్ కాల్ ద్వారా అవసరం ఉన్నవారు రుణం తీసుకుంటారని, వారికి 60 శాతం నుంచి 200 శాతం వడ్డీకి కాల్ మనీ నిర్వాహకులు అప్పులు ఇస్తుంటారని పేర్కొంది. రుణం కోసం రుణగ్రహీతలు తమ ఇళ్లు, పొలాలు, వాహనాలను గ్యారెంటీగా పెడతారని పేర్కొంది.

రుణగ్రహీతలు అనుకున్న సమయానికి తీసుకున్న అప్పును చెల్లించకుంటే.. అప్పు ఇచ్చినవారు వేధిస్తారని, బలాత్కారం చేస్తారని, బ్లాక్ మెయిల్ చేస్తారని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతారని పేర్కొంది. ఈ సందర్భంగా కొందరు మహిళల ఆవేదనను ప్రస్తావించింది.

కాల్ మనీ కేసులో ఫిర్యాదు నేపథ్యంలో ఓ ప్రభుత్వ ఉద్యోగితో పాటు పలువురిని అరెస్టు చేశారని, ఇందులో ఇద్దరి పైన అత్యాచారం కింద కేసు పెట్టారని పేర్కొంది.

కాగా ఈ రాకెట్లో పలువురు ముఖ్యుల హస్తం ఉండవచ్చునని, ఇది రూ.700 కోట్ల రూపాయల రాకెట్‌గా కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, కాల్ మనీ రాకెట్ చంద్రబాబుకు చిక్కులు తెచ్చిందని చాలామంది భావిస్తున్నారు. కాల్ మనీలో టిడిపి నేతలే ఉన్నారని ప్రతిపక్ష వైసిపి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తోన్న అంశాన్ని ప్రస్తావించింది. తమ పార్టీ నేతల పైన చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు జంకుతున్నారని జగన్ ఆరోపిస్తున్నారు కూడా.

దీంతో చంద్రబాబు పైన చాలా ఒత్తిడి ఉందని అంటున్నారు. ప్రాథమిక విచారణలో పలు పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారని తేలింది. కాల్ మనీ కేసుపైన చంద్రబాబు న్యాయవిచారణకు ఆదేశించారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జితో న్యాయవిచారణకు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+