అతను లేకుండా బతకలేను...సూసైడ్ నోట్‌లో ఎస్వీ కాలేజ్ మెడికో గీతిక
తిరుపతి:ఇద్దరు వైద్య విద్యార్థినుల వరుస ఆత్మహత్యలతో అట్టుడికిన ఎస్వీ మెడికల్ కాలేజీ వ్యవహారంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన గీతిక బలవన్మరణానికి కారణం ప్రేమ వ్యవహారమేనని తేలిపోయింది.
గీతిక రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యం కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటనేది వెల్లడయింది. మరణానికి ముందు గీతిక తన తల్లిని ఉద్దేశించి లేఖ రాస్తూ తన ప్రేమికుడి గురించి ప్రస్తావించి...అతడు లేకుండా బతకలేను అలాగని...అతడితో కలసి బతకలేను...నన్ను క్షమించు అంటూ సూసైడ్ నోట్ రాసింది. గీతిక రాసిన సూసైడ్ నోట్‌లో ఉన్నది మ్యాటర్ యాధాతథంగా...

ఎస్వీ కాలేజ్ లో ఇటీవలే పిజి వైద్య విద్యార్ధిని ప్రొఫెసర్ల వేధింపుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణల క్రమంలో మరో వైద్య విద్యార్థిని గీతిక సూసైడ్ సంచలనం సృష్టించింది. అయితే గీతిక మరణానికి వ్యక్తిగత సమస్యే కారణమని ఆమె తల్లి ముందుగానే పోలీసులకు చెప్పగా...తాజాగా సూసైడ్ నోట్ లభ్యంతో అదే విషయం తేలిపోయింది.
అయితే సూసైడ్ నోట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గీతిక ఆత్మహత్య వ్యవహారంలో పేర్కొన్న వ్యక్తి గురించి, మరణానికి దారితీసిన కారణాల గురించి విచారణ జరిపి అందులో ఎవరి ప్రోద్భలం అయినా ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications