అన్ని దారులు క్లోజ్! తెలుగు టెక్కీలకు ఆ దేశం ఒక్కటే దిక్కు.. ఎక్కడ?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పరిస్థితులు చూస్తుంటే.. ఇండియన్ టెక్కీలకు అన్ని దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తున్నాయి. టెక్కీలు ఎక్కువగా ఆసక్తి కనబరిచే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు విదేశీ టెక్కీలకు తలుపులు మూసివేస్తుండటంతో.. తెలుగు రాష్ట్రాల్లోని టెక్కీలు గందరగోళ స్థితిలో ఉన్నారు.

అమెరికాలో హెచ్1బి వీసాపై ఆంక్షలు, ఆస్ట్రేలియాలో 457వీసా రద్దు, బ్రిటన్ లోను విదేశీయులకు చెక్ పెట్టే ప్రయత్నాలు.. తెలుగు టెక్కీలకు ఆయా దేశాల్లో అవకాశాలను దూరం చేశాయి. ఆఖరికి గల్ఫ్ వైపు చూద్దామన్నా.. అక్కడ కూడా ఇలాంటి కష్టాలే వెంటాడుతుండటంతో ఏం చేయాలో తోచని స్థితిలో తెలుగు టెక్కీలు కొట్టుమిట్టాడుతున్నారు.

canada is the only country offering tech jobs

ఇలాంటి తరుణంలో కెనడా ఒక్కటే చాాలామందికి తమ కలల దేశంగా కనిపిస్తోంది. కెనడాలో ఐటీ రంగ నిపుణులకు ఎక్కువగా అవకాశాలు ఉండటం, ఆ దేశంలో నిపుణులు, మానవ వనరుల కొరత ఉండటంతో విదేశీయులకు అవకాశాలు దక్కుతున్నాయి. 2021నాటికి దాదాపు 2.20లక్షల ఐటీ ఉద్యోగాలు ఈ దేశంలో అందుబాటులో ఉంటాయని అంచనా.

ప్రస్తుతం కెనడాలో 14లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. ఏటా ఈ డిమాండ్ 3శాతం మేర పెరుగుతూ వస్తోంది. వర్చువల్ అండ్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ(వీఆర్&ఏఆర్), త్రీడి ప్రింటింగ్, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్, ఇంటలిజెన్స్, 5జీ మొబైల్ టెక్నాలజీ రంగంలో ఇక్కడ విస్తృతంగా అవకాశాలున్నాయి.

వీటితో పాటు డేటా బేస్డ్ జాబ్స్, అనలిస్ట్‌లు, డేటా అడ్మినిస్ర్టేటర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కౌన్సిల్(ఐసీటీసీ) తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
America, Britain, Australia, these three countries are shutter downed for foreign techies in their country. Canada is the only country offering opportunities for techies
Please Wait while comments are loading...