ఏపీ నుంచే దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా-నల్గొండ ఎస్పీ షాకింగ్ కామెంట్స్-పవన్ ట్వీట్
ఏపీలో కొంతకాలంగా గంజాయిపై జరుగుతున్నంత చర్చ ఉమ్మడి ఏపీలో సైతం జరగలేదు. విపక్షాలు అదే పనిగా అక్రమ గంజాయి సరఫరాపై విమర్శలు చేస్తున్నా చూసీచూడనట్లుగా ముందుకు పోతున్న ప్రభుత్వానికి తాజాగా తెలంగాణ ప్రభుత్వంలో ఓ అధికారి షాకిచ్చారు. ఏపీలో విపక్షాలు చేస్తున్న విమర్శలకు కొనసాగింపుగా ఉన్న ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇవే కామెంట్స్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసి జగన్ సర్కార్ ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీ గంజాయి రచ్చ
ఏపీలోని విశాఖ మన్యంతో పాటు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల నుంచి భారీ ఎత్తున గంజాయి తయారై దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. పలు సందర్భాల్లో పట్టుబడిన వాహనాల్లో పోలీసులు, ఎస్ఈబీ(స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో) అధికారులు భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దీనిపై ప్రభుత్వం అంతకు మించి ఏమీ చేయలేని పరిస్దితి కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ బలహీనతను గుర్తించిన విపక్షాలు గంజాయి రచ్చను పతాకస్ధాయికి తీసుకెళ్తున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులు ఇవ్వగా.. దీన్ని వ్యతిరేకిస్తూ మరో నేత పట్టాభి చేసిన బోసడికే కామెంట్స్ సంచలనం రేపాయి. ఇది కాస్తా టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడుల వరకూ వెళ్లింది.

నల్గొండ ఎస్పీ షాకింగ్ కామెంట్స్
ఏపీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతోందని ఎప్పటినుంచో విపక్షాలు ఆరోపిస్తుండగా.. తాజాగా నల్గొండ ఎస్పీ రంగనాథ్ దీనిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముఖ్యంగా ఏపీలోని ఏవోబీ(ఆంధ్రా ఒడిశా సరిహద్దు) ప్రాంతాల్లో భారీ ఎత్తున గంజాయి సాగవుతోందని, అక్కడి నుంచే దేశవ్యాప్తంగా సరఫరా అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో సాగు చేసే వారు, వ్యాపారులు, రాజకీయ నేతలు, బ్రోకర్లు, ఇలా చాలా మంది పాత్ర ఉందని ఆయన ఆరోపణలు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా సంచలనం రేపుతోంది.
ఎస్పీ వ్యాఖ్యల్ని ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్
ఏపీలోని ఏవోబీ నుంచి దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా జరుగుతోందంటూ నల్గొండ ఎస్పీ రంగనాథ్ చేసిన వ్యాఖ్యల వీడియోను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇావాళ ట్వీట్ చేశారు. ఇందులో ఎస్పీ చేసిన కామెంట్స్ ను ఈ ట్వీట్ కు కోట్ చేశారు. అంతే కాదు వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో ఇప్పుడు నల్గొండ ఎస్పీ కామెంట్స్ కంటే జనసేన అధినేత కామెంట్స్ ఎక్కువ కలకలం రేపేలా ఉన్నాయి. ఇప్పటివరకూ గంజాయి సరఫరాపై వైసీపీ సర్కార్ ను టీడీపీ టార్గెట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వీడియో వ్యాఖ్యలతో ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది.
Recommended Video

పవన్ షాకింగ్ కామెంట్స్
ఏపీ నుంచే దేశానికి గంజాయి సరఫరా జరుగుతోందంటూ తాను చేసిన ట్వీట్లో నల్గొండ ఎస్పీ రంగనాథ్ వీడియో వ్యాఖ్యలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నార్కోటిక్స్ హబ్ గా తయారవుతోందని పవన్ ఆరోపించారు. ప్రతీ స్ధాయిలోనూ డ్రగ్స్ ఆసాములతో నిండిపోయుందన్నారు. జగన్ సర్కార్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో దేశం తీవ్రంగా ప్రభావితమవుతోందని పవన్ ఆరోపించారు. దీంతో ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కేంద్రంలోని బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని కేంద్రంలో పెద్దల దృష్టికి తీసుకెళ్లకుండా ట్వీట్లతో ప్రభుత్వాలపై విమర్శలు చేయడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications