మీ త్యాగాలు వృధా కావు; రాజధాని అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది: నారా భువనేశ్వరి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. ప్రస్తుతం 25 రోజులుగా చంద్రబాబు రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉన్నారు. ఇక చంద్రబాబు కోసం టీడీపీ నాయకులు, అభిమానులు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా చంద్రబాబు కోసం పోరుబాట పట్టారు.

తాజాగా రాజమండ్రిలో నిజం గెలవాలి అంటూ ఆందోళన కొనసాగిస్తున్న నారా భువనేశ్వరిని రాజధాని అమరావతి ప్రాంత రైతులు కలిశారు.చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కి నిరసనగా, "నిజం గెలవాలి" అంటూ పోరాటం చేస్తున్న నారా భువనేశ్వరి గారిని కలిసి సంఘీభావం తెలపాలని రాజమహేంద్రవరం బయలుదేరిన రాజధాని రైతులను, వీరవల్లి టోల్‍ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Capital Amaravati will be built: Nara Bhuvaneshwari

రాజమండ్రి వెళ్ళటానికి అనుమతి లేదని రైతులు వెళ్తున్న బస్సులను నిలిపివేసి వారిని ఇబ్బందులకు గురిచేశారు. అయినా రాజమండ్రికి వెళ్ళిన అమరావతి ప్రాంత రైతులు రాజమహేంద్రవరం వెళ్లి నారా భువనేశ్వరి గారిని కలిసి ఆమెకు తమ సంఘీభావాన్ని తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ఖండించారు.

ధైర్యంగా ఉండాలని, త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని రాజధాని ప్రాంత మహిళా రైతులు పలువురు నారా భువనేశ్వరికి ధైర్యం చెప్పారు. చంద్రబాబు కుటుంబానికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా వారితో మాట్లాడిన నారా భువనేశ్వరి రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృధా కావన్నారు.

రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాల గురించి చంద్రబాబు ఎప్పుడూ చెబుతూ ఉండేవారని అన్నారు. ఎప్పటికైనా మీకు న్యాయం జరుగుతుందని నారా భువనేశ్వరి రైతులతో చెప్పారు. రాజధాని రైతులపై పెట్టిన కేసులు, కక్ష సాధింపు చర్యలు అన్నీ తనకు తెలుసు అన్న నారా భువనేశ్వరి రైతులు ధైర్యంగా నిలబడాలని, మళ్ళీ మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. అమరావతిన్ ప్రాంత రైతులు చంద్రబాబు కోసం కంటతడి పెట్టుకోవటంతో భువనేశ్వరి వారిని ఓదార్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+