హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫొటో: పల్లీ కొట్టిన కారు తుక్కు, విద్యార్థులకు గాయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలోని ఔటర్ రింగురోడ్డుపై మంగళవారం ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

వివరాలు ఇలా ఉన్నాయి - మెదక్ జిల్లా రుద్రారంలోని గీతం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చంద్రకిరణ్, చైతన్య, నిఖిల్, దీపిక, శ్రీయ, నమ్రత కారులో చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్ళారు. దర్శనం అనంతరం తిరిగి వెళుతుండగా కొత్వాల్‌గూడ జేఎన్ఎన్‌యూఆర్ఎం గృహసముదాయాల సమీపంలో కారు మందు టైరు పగిలి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది.

 Car accident at Hyderabad outer ring road

దాదాపు రెండు వందల మీటర్ల దూరం దూసుకెళ్ళి బోల్తాపడింది. ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో నమ్రత, శ్రీయ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది. గాయపడ్డ విద్యార్థులు నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు చంద్రకిరణ్ కారు నడుపుతున్నట్టు తెలిసింది.

ఈ కారు బొంగుళూరు టోల్‌గేటు వద్ద ఔటర్ రింగురోడ్డు ఎక్కినట్టు ఉన్న కూపన్ లభించిందని, కారులో పగిలిపోయిన మద్యం బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లు లభించాయని ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గాయపడ్డ విద్యార్థులు నగరంలోని కూకట్‌పల్లి, పటాన్‌చెరు ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు.

English summary
In a car accident at Hyderabad outer ring road six engineering students have been injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X