అగ్నికి కారు ఆహుతి: విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఓ కారు అగ్నికి ఆహుతి అయ్యింది. నాల్గవ టౌన్ సమీపంలోని కార్ డెకార్ ఎదుట నిలిపి ఉంచిన కారు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులోని గ్యాస్ లీక్ కావడంతో కారు పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ప్రక్కనున్న మరో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖపట్నంలోని ఫ్లై స్పారో హ్యుమన్ రీసోర్సెస్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ మోసానికి పాల్పడింది. నిరుద్యోగుల వద్ద రూ.కోటికి పైగా టోకరా వేసి బోర్డు తిప్పేసింది. సింగపూర్‌కు 300 మంది, ఆస్ట్రేలియాకు 30 మందిని పంపించేందుకు కంపెనీ లక్షల్లో డబ్బులు వసూలు చేసింది.

మూడు రోజుల నుంచి కంపెనీ మూతపడటంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. తమను మోసం చేశారంటూ ఉద్యోగులకు చెన్నై నుంచి సంతోష్ శివ, సాయి శ్రీధర్‌లు మేసేజ్‌లు పంపడంతో, స్థానికులు త్రీటౌప్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే ఆస్ట్రేలియా బయలుదేరిన 20 మంది ఉద్యోగులు ఢిల్లీలో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ అధినేత పాండియన్ చెన్నై వాసిగా సమాచారం.












Click it and Unblock the Notifications