కేసు నమోదు: ఆగ్రహంతో గన్‌మెన్‌ను వెనక్కి పంపిన వల్లభనేని వంశీ
విజయవాడ: విజయవాడలోని రామవరప్పాడు ఘటన విషయంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. బలవంతంగా ఆక్రమణలు తొలగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వల్లభనేని వంశీపై పటమట పీఎస్‌లో కేసు నమోదు చేశారు.
దీనికి నిరసనగా వంశీ తన గన్‌మెన్‌లను వెనక్కిపంపారు. గన్‌మెన్లను తిరష్కరించడంతో ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు గన్‌మెన్లు సమాచారాన్ని అందించారు. ఆదివారం ఉదయం ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులకు ఎమ్మెల్యే వంశీ మద్దతు తెలిపారు.

కృష్ణా జిల్లాలోని విజయవాడ నగరం రైవస్ కాలువ గట్టు పైన ఇల్లు నిర్మించుకొని ఉంటున్న స్థానికులు తమ ఇళ్లను తొలగించరాదంటూ ఆదివారం ఉదయం జాతీయ రహదారి పైన ఆందోళన నిర్వహించారు. వీరి ఆందోళనకు టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మద్దతు పలికారు.
ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం రైవస్ కాలువ గట్టు పైన ఉన్న 300 ఇళ్లను తొలగించేందుకు అధికారులు శనివారం రాత్రి నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా ఇక్కడ కొన్ని ఇళ్లను తొలగించారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇంకా స్థలం కావాల్సి ఉందని భావించిన అధికారులు మిగతా 300 ఏళ్లను తొలగించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications