పవన్ పై అనుచిత వ్యాఖ్యలు: పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ఫిలిం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్లను తిడితే వారి కుటుంబ సభ్యులు బాధపడరా అని ప్రశ్నించిన పోసాని కృష్ణ మురళి వాలంటీర్ల లో ఆడవాళ్లు ఉంటారని ఆడవాళ్లపై అగౌరవం పవన్ కళ్యాణ్ కు తగదని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ చాలా గొప్పదని పేర్కొని పవన్ కళ్యాణ్ ను తూర్పారబట్టారు.
భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓటమికి టిడిపినే కారణమని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గుప్పిట్లో ఉన్నాడని పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో విమర్శించారు కాపు ఓట్ల కోసం అత్తా కోడలు పవన్ తో డ్రామా ఆడుతున్నారని, తిట్టారని మర్చిపోయి ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ ని కలిశారని భువనేశ్వరి నారా బ్రాహ్మణి లను టార్గెట్ చేశారు.

అత్త కోడలు ఇద్దరు కలిసి పవన్ ను ఐస్ చేశారని పేర్కొన్న పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించిన జనసేన పార్టీ నాయకులు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.
కోర్టు ఆదేశాలతో... నటుడు, దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ పార్టీ నేతలు రాజమహేంద్రవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జనసేన నాయకులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదని, జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు.
వారి వాదనలు విన్న న్యాయస్థానం పోసానిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏపీ ఫిలిం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ పోసాని కృష్ణమురళి పై ... ఇండియన్ పీనల్ కోడ్ 354, 355, 500,504, 506, 507, 509 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications