జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ ట్విస్ట్-ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు-14న తేలిపోతుందా ?

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో పలు ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కౌంటర్లు దాఖలు చేసేందుకు కూడా మొరాయించిన జగన్, సీబీఐ న్యాయవాదులు గత నెలలో తమ వాదనను కోర్టుకు తెలిపాయి. అయితే రాతపూకర్వకంగా వాదనలు తెలపాలని సీబీఐ కోర్టు కోరడంతో ఇప్పుడు జగన్, రఘురామ మాత్రమే వాటిని సమర్పించగా.. సీబీఐ మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో ఈ కేసులో సీబీఐ స్టాండ్ ఎలాా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

జగన్ బెయిల్ రద్దు కేసులో ట్విస్టులు

జగన్ బెయిల్ రద్దు కేసులో ట్విస్టులు

ఏపీ సీఎం జగన్ కు గతంలో సీబీఐ కోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పలు మలుపులు తిరుగుతోంది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఈ కేసులో పిటిషనర్ అయిన రఘురామరాజు, ప్రతివాదులైన జగన్, సీబీఐ రాతపూర్వక వాదనలు సమర్పించాల్సి ఉండగా.. కేవలం జగనా్, రఘురామ మాత్రమే సమర్పించారు. సీబీఐ మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. అసలే సీబీఐ తీసుకునే నిర్ణయమే కీలకంగా మారిన నేపథ్యంలో తాజా పరిణామాలు భవిష్యత్తులో ఏ మలుపుకులకు దారి తీస్తాయో తెలియని పరిస్ధితి నెలకొంది.

 గతంలో సీబీఐ కప్పదాటు వైఖరి

గతంలో సీబీఐ కప్పదాటు వైఖరి

గతంలో జగన్ బెయిల్ రద్దుపై రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై మెమో సమర్పించిన సీబీఐ ఏ నిర్ణయం తీసుకోలేదు. సీబీఐ కోర్టు జగన్ బెయిల్ రద్దుపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని మాత్రమే కోరింది. దీంతో సీబీఐ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. దర్యాప్తు సంస్ధగా జగన్ బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్న దానిపై నిర్దిష్టంగా తన వైఖరి చెప్పకుండా కప్పదాటు వైఖరిని ప్రదర్శించడంపై సీబీఐ విమర్శలు ఎదుర్కొంది. దీంతో సీబీఐ కోర్టులో విచారణ సందర్భఁగా సీబీఐ న్యాయవాదులు మరో వాదన వినిపిస్తారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగింది.

వైఖరి జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ మల్లగుల్లాలు

వైఖరి జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ మల్లగుల్లాలు

అక్రమాస్తుల కేసులో గతంలో సీబీఐ కోర్టు జగన్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరాలా వద్దా అన్న అంశంపై సీబీఐ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగిన విచారణ సందర్భఁగా కూడా సీబీఐ తన వైఖరిని రాతపూర్వకంగా వెల్లడించలేదు. అలాగని గత వైఖరికి కట్టుబడి ఉంటున్నట్లు కూడా సీబీఐ కోర్టుకు చెప్పలేదు. దీంతో సీబీఐ తన వైఖరి మార్చుకుంటుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తదుపరి విచారణలో సీబీఐ తన వైఖరిని రాతపూర్వకంగా కోర్టుకు తెలిపే అవకాశముంది.

Recommended Video

    Union Cabinet Reshuffle : దక్షిణాదిన ఏపీకి మొండిచెయ్యి | Impact On AP Key Projects | Oneindia Telugu
    14న తేలనున్న జగన్ భవితవ్యం

    14న తేలనున్న జగన్ భవితవ్యం


    జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఇవాళ జరగాల్సిన విచారణ సీబీఐ తన వాదనలు రాతపూర్వకంగా సమర్పించకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా పడింది. మధ్యాహ్నం వరకూ సమయం ఇచ్చినా సీబీఐ మాత్రం రాతపూర్వక వాదనలు సమర్పించడం లేదని కోర్టుకు తెలిపింది. అదే సమయంలో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం పనిచేయని కారణంగా
    విచారణ కొనసాగించే పరిస్ధితి కూడా లేకపోవడంతో తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అదే రోజు తుది విచారణ జరుపుతామని కూడా సీబీఐ కోర్టు స్పష్టం చేయడంతో జగన్ భవితవ్యం తేలిపోనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+