అక్కడకు వెళ్లడానికి ముఖ్యమంత్రి జగన్ కు అనుమతి మంజూరు చేసిన సీబీఐ కోర్టు
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వారంరోజులపాటు విహార యాత్రకు వెళుతున్నారు. ముందుగా దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. ఈసారి అక్కడ ఏపీ కి ఒక పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు. మూడురోజులపాటు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న జగన్ అక్కడి నుంచి వ్యక్తిగతంగా విహారయాత్రకు వెళ్లబోతున్నారు. స్విట్జర్లాండ్‌లోనే యాత్రకు వెళతారా? ఇతర దేశాలకు వెళతారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈనెల 19వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. అధికారికంగా పర్యటనకు వెళ్లాలని అనుమతి కావాలంటూ జగన్ పిటిషన్ పెట్టుకున్నారు. సీబీఐ కోర్టులో జరిగిన ఈ విచారణలో జగన్ పర్యటనకు అమనుతి ఇవ్వొద్దంటూ సీబీఐ న్యాయవాదులు కోర్టును కోరారు. కేసు విచారణ ఆలస్యమవుతోందని, చెప్పారు. అయితే న్యాయమూర్తి వారి వాదనలను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జగన్ పెట్టుబడుల కోసం విదేశాలకు వెళుతున్నారు.

పరిశ్రమలశాఖ మంత్రిగా గౌతమ్‌రెడ్డి ఉన్నప్పుడు పెట్టుబడుల కోసం ఆయన ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసేవారు. ఆయన హఠాన్మరణం పాలవడంతో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా బయలుదేరుతున్నారు. అంతేకాకుండా దావోస్ లో తొలిసారి ఏపీ కోసం ఒక పెవిలియన్ ఏర్పాటుచేసి పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ ఉన్న అవకాశాలు, ఇతర మౌలిక సౌకర్యాలను అధికారులు పెట్టుబడిదారులకు వివరిస్తారు. అయితే ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పెట్టుబడులు వస్తాయని అనుకోవద్దని ముందుగానే వ్యాఖ్యానించడం ప్రజల్ని విస్మయానికి గురిచేసింది.












Click it and Unblock the Notifications