చెన్నై వెళ్లేందుకు జగన్‌కు ఓకే, లక్నో వెళ్లేందుకు మళ్లీ
హైదరాబాద్: ఈ నెల 4న చెన్నై వెళ్లేందుకు అనుమతి కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. సిబిఐ న్యాయమూర్తి సెలవులో ఉండటంతో 4వ ఎంఎస్‌జే కోర్టును ఇన్‌చార్జ్ కోర్టుగా వ్యవహరించాలని హైకోర్టు పేర్కొంది. ఆ మేరకు జగన్ కేసును విచారణ జరిపిన న్యాయస్థానం జగన్‌కు అనుమతి మంజూరు చేసింది.
గతంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వెళ్లేందుకు అనుమతి కోరి, తర్వాత ఉపసంహరించుకున్న పిటిషన్‌ను ఆయన తాజాగా దాఖలు చేశారు. 3న లక్నో వెళ్లాలని అందులో పేర్కొనగా ఆ కేసును కోర్టు, మంగళవారానికి వాయిదా వేసింది. 5న బెంగళూరు వెళ్లాలని.. జగన్ మరో పిటిషన్ వేశారు.

ఈ కేసు విచారణను కోర్టు 4కు వాయిదా వేసింది. మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఓఎంసి కేసులో నిందితుడు, ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ జగతి ఆడిటర్ విజయ సాయి రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను ఇన్‌చార్జ్ కోర్టు 5కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications