వైఎస్ వివేకా హత్యకేసుపై సీబీఐ కోర్టులో కీలక పరిణామం..!!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసును సీబీఐ న్యాయస్థానం విచారిస్తోంది. ఇవ్వాళ ఈ పిటీషన్లపై విచారణ చేపట్టింది. నిందితులు కోర్టు సమక్షానికి హాజరయ్యారు.

హైదరాబాద్/అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ న్యాయస్థానం ఇవ్వాళ ఈ కేసుపై విచారించింది. వైఎస్ఆర్సీపీకే చెందిన కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసిన వేళ.. సీబీఐ స్పెషల్ కోర్ట్.. న్యాయస్థానం అదే కేసుపై విచారణను ముమ్మరం చేసింది.

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి ఇదివరకే నోటీసులను కూడా జారీ చేశారు సీబీఐ అధికారులు. తన వాంగ్మూలాలను తారుమారు చేస్తోన్నారంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరిపేలా ఆదేశాలను జారీ చేయాలంటూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు.

CBI Court postponed the next hearing of YS Vivekananda Reddys murder case to March 31

అదే సమయంలో- వివేకా హత్యకేసుపై దాఖలైన పిటీషన్లు, కేసులు.. ఇవ్వాళ సీబీఐ న్యాయస్థానం సమక్షానికి వచ్చాయి. దీనిపై కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఇదివరకే అరెస్ట్ అయిన నలుగురు నిందితులు- ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, శివ శంకర్ రెడ్డి, ఉమాశంకర్ విచారణకు హాజరయ్యారు. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పోలీసులు వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదోపవాదనలను సీబీఐ న్యాయస్థానం ఆలకించింది. అనంతరం ఈ కేసును ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.

అటు తెలంగాణ హైకోర్టులో కూడా అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ఇవ్వాళే విచారణకు వచ్చింది. సీబీఐ అధికారులు ఉద్దేశపూరకంగా తాను ఇచ్చిన స్టేట్ మెంట్లను మార్చివేస్తోన్నారని ఆయన ఆరోపించారు. తాను ఇచ్చిన వాంగ్మూలాల్లో మార్పులు చేస్తోన్నారని ఆరోపించారు. న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దిశగా అనుమతులు మంజూరు చేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

సీఆర్పీసీలోని సెక్షన్ 160 కింద నోటీస్‌ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేసే అధికారం లేదని వివరించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అధికారులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వివేకా హత్యకేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఉద్దేశపూరకంగా తనను ఇరికించే ప్రయత్నానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+