Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ - ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..!!

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 15 ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా తేల్చింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా న్యాయస్థానం వెల్లడించింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌ పై 2009లో సీబీఐ కేసు నమోదు అయింది. ఆ తరువాత 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ పలువురిని విచారించింది. మొత్తం 4 అభియోగపత్రాల్లో 9 మందిని సీబీఐ నిందితు లుకా చేర్చింది. ఇక, తీర్పు ఖరారు సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి కోర్టుకు ప్రత్యేకంగా అభ్యర్ధన లు చేసారు. శిక్ష తగ్గించాలని ప్రాధేయ పడ్డారు.

కోర్టు తీర్పుతో
దాదాపు 15 ఏళ్ల తరువాత ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అయిదుగురికి శిక్ష ఖరారు చేసింది. మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ మంత్రి గా పని చేసిన సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్ధన్ రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా సీబీఐ కోర్టు తేల్చేసింది. సబిత తో పాటు ఏ8 కృపా నందంను కూడా న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో శ్రీనివాసరెడ్డి, గాలి జనార్ధన్‌ రెడ్డితో పాటు ఏ3 వీ.డీ రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఏ7 అలీ ఖాన్‌లకు కోర్టు శిక్ష ఖరారు చేసింది.

cbi-court-pronounced-verdict-in-obluapuram-mining-case

ఏడేళ్ల శిక్ష
ఓఎంసీ కేసులో కేసులో గాలి సోదరుడు బీవీ శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్‌ రెడ్డికి కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది. ఉమ్మడి ఏపీలో ఓబులాపురం మైనింగ్ వ్యవహారం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నాడు సభా సంఘం సైతం మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించింది. కాగా, ఈ కేసు విచారణ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఐదు మంది నిందితుల ను ఇప్పటికే వాళ్ల దోషులుగా తేల్చుతూ వారికి శిక్షలు కూడా కోర్టు ఖరారు చేసింది కోర్టు. సుదీర్ఘంగా విచారించిన తర్వాత నాలుగు చార్జ్‌షీట్లను ఇప్పటికే సీబీఐ కోర్టు ముందు సీబీఐ అధికారులు సమర్పించారు. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఏ1, ఏ2లకు ఏడేళ్ల పాటు శిక్షలు ఖరారు చేసింది. ఇక, శిక్ష ఖరారు సమయంలో గాలి జనార్ధన రెడ్డి కోర్టును ప్రత్యేకంగా అభ్యర్ధన చేసారు. తన వయసుతో పాటుగా సామాజిక సేవను గుర్తించి శిక్ష తగ్గించాలని కోర్టును కోరారు. జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యల పైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+