జగన్‌కు షాక్: ఇతర రాష్ట్రాల అనుమతి పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం చుక్కెదురైంది. తనకు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలన్న ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది.
మరోవైపు లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జీషీటు అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు అధికారులు బిపి ఆచార్య, శామ్యూల్, శాంబాబు, మురళీధర్ రెడ్డిలు వచ్చారు.

మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, మంత్రి గీతా రెడ్డిలు గైర్హాజరయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై గీతా రెడ్డి ఢిల్లీకి వెళ్లినందున కోర్టుకు హాజరు కాలేనని ఆమె తరఫు న్యాయవాది చెప్పారు. సుప్రీం కోర్టులో విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లినట్లు ధర్మాన కోర్టుకు తెలిపారు.












Click it and Unblock the Notifications