వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్కంఠ: కోర్టు హజరుపై మినహయింపు లభిస్తోందా, జగన్ ప్లాన్ ఇదే!

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సిబిఐ కోర్టుకు ప్రతి శుక్రవారం హజరుకావాలనే నిబంధనపై మినహయింపు ఇవ్వాలనే విషయమై సిబిఐ కోర్టు అక్టోబర్ 23న, తీర్పు వెలువరించనుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సిబిఐ కోర్టుకు ప్రతి శుక్రవారం హజరుకావాలనే నిబంధనపై మినహయింపు ఇవ్వాలనే విషయమై సిబిఐ కోర్టు అక్టోబర్ 23న, తీర్పు వెలువరించనుంది.

వైసీపీ చీఫ్ జగన్ నవంబర్ రెండవ తేది నుండి పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. ఈ పాదయాత్ర కోసం వైసీపీ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆస్తుల కేసులో ఇప్పటికే ప్రతి శుక్రవారం నాడు జగన్ సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హజరుకావాలి.

జగన్‌కు షాకిస్తారా: 'టిడిపిలో చేరడం లేదు, 2019లో పోటీపై వారంలో నిర్ణయం'జగన్‌కు షాకిస్తారా: 'టిడిపిలో చేరడం లేదు, 2019లో పోటీపై వారంలో నిర్ణయం'

దీంతో ప్రతి శుక్రవారం నాడు వైఎస్ జగన్ సిబిఐ కోర్టుకు హజరుకావడంపై మినహయింపు ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. జగన్ తరపు న్యాయవాదులు, సిబిఐ తరపు న్యాయవాదులు తమ వాదనలను విన్పించారు.

ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత కేసును అక్టోబర్ 23వ, తేదికి కోర్టు వాయిదా వేసింది. అయితే ఈ కేసు విషయమై తీర్పు ఎలా ఉంటుందోననే విషయమై వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రను పురస్కరించుకొని ప్రతి శుక్రవారం నాడు వ్యక్తిగతంగా కోర్టుకు హజరుకావడాన్ని మినహయింపు ఇచ్చే విషయంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది. ప్రతి శుక్రవారం నాడు కోర్టుకు హజరుకావాల్సి వస్తే పాదయాత్రకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయంతో వైసీపీ నాయకత్వం ఉంది. అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వైసీపీ చేస్తోంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వైసీపీ ప్లాన్

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వైసీపీ ప్లాన్

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు వ్యక్తిగతంగా కోర్టుకు హజరుకాకుండా మినహయింపు లభించకపోతే ఏం చేయాలనే దానిపై కూడ వైసీపీ నాయకత్వం ఆలోచిస్తోంది. కోర్టుకు హజరయ్యే కారణంతో పాదయాత్రకు బ్రేక్ పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ నాయకత్వం చర్యలను చేపట్టింది. కోర్టుకు హజరుకావడానికి ప్రత్యేక విమానం ద్వారా హైద్రాబాద్‌కు వచ్చి కోర్టకు హజరయ్యేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఒకవేళ కోర్టు అనుమతి లభిస్తే ఇబ్బందులుండవంటున్నారు వైసీపీ నేతలు.

జగన్‌కు మినహయింపు

జగన్‌కు మినహయింపు

2014 ఎన్నికల్లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం కోసం సిబిఐ కోర్టు ప్రతి శుక్రవారం నాడు మినహయింపు ఇచ్చింది. ఎన్నికల ప్రచారం కోసం పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న జగన్‌కు కోర్టు ఈ అనుమతిని మంజూరు చేసింది. అయితే పాదయాత్ర విషయంలో కూడ మినహయింపు లభించే అవకాశం ఉందని వైసీపీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

కోర్టు తీర్పుపై పాదయాత్ర ప్రభావం

కోర్టు తీర్పుపై పాదయాత్ర ప్రభావం

నంద్యాల, కాకినాడ ఫలితాలు వైసీపీకి నష్టం కల్గించాయి. ఈ పరిణామాలతో వైసీపీ శ్రేణులు కొంత నైరాశ్యంలో ఉన్నాయి.ఈ తరుణంలోనే ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పాదయాత్ర ద్వారా ప్రచారం చేయాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయనున్నామో వివరించనున్నారు. అయితే కోర్టు తీర్పు అనకూలంగా వస్తే వైసీపీ శ్రేణుల్లో జోష్ ఉంటుంది. వ్యతిరేకంగా వస్తే ఆ పార్టీ శ్రేణుల్లో సహజంగానే నిరుత్సాహం ఉండే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.


వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్రంకు వీకెండ్ బ్రేక్ ఉంటుందా? అనుమతి రాకపోతే పరిస్థితేంటి? మధ్య మధ్యలో కోర్టుకు వస్తే రాజకీయ సీరియస్‌నెస్ పోతుందా? శుక్రవారం మినహాయింపునకు కోర్టు తీర్పు విషయంలో వైసీసీ ఏమాలోచిస్తోంది? జగన్ ఏం చేయాలనుకుంటున్నారు? సోమవారం ఎలాంటి తీర్పు రాబోతోంది? వైసీపీలో 23న ఏంజరగనుందో అని టెన్షన్ కనిపిస్తోంది. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే పాదయాత్ర ఎలా ఉండాలి? ప్రతికూలంగా వస్తే పాదయాత్ర ఎలా చేయాలనే విషయంపై పార్టీ అగ్ర నాయకత్వం విస్తృతంగా చర్చలు జరుపుతోంది.

నంద్యాల, కాకినాడ ఉపఎన్నికల తర్వాత నిరుత్సాహానికి గురైన కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు జగన్ చేస్తానన్నపాదయాత్ర వైసీపీ వరం కానుందా? లేక శాపంగా మారనుందా? అన్న ఆలోచన నేతల్లో నెలకొంది. పాదయాత్ర ద్వారా అనుకున్న లక్ష్యానికి చేరువ కావచ్చని భావించిన జగన్‌కు సోమవారం (రేపు) కోర్టు తీర్పు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే శుక్రవారం మినహాయింపుకు సీబీఐ హైకోర్టుకు పెట్టుకున్న అభ్యర్థన ఫలించలేదు. పాదయాత్ర చేస్తున్నందున ఆరు నెలలపాటు శుక్రవారం కోర్టుకు హాజరయ్యే అంశంలో వెసులుబాటు కల్పించాలని జగన్ కోరారు. నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే.

English summary
CBI court will deliver decission on Oct 23 to exemption Ys Jagan to attend every friday to court.CBI lawyer opposed to filed ysrcp chief Ys jagan seeking exemption from appearing before court in person on Fridays.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X