వెన‌క్కి త‌గ్గేదేలే: వివేకాను హ‌త్య చేయించిందెవ‌రో క‌నిపెట్టిన సీబీఐ?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డిని హ‌త్య చేయించిందెరో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ క‌నిపెట్టింద‌ని, ఆధారాల కోస‌మే విచార‌ణ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని భావిస్తున్నారు. హ‌త్య కేసులో ప్ర‌మేయమున్న‌వారిపై ఛార్జిషీటు వేసి నిందితుల‌ను అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ వీట‌న్నింటిక‌న్నా ముఖ్య‌మైంది హ‌త్య చేసిన‌వారు కాద‌ని, హ‌త్య చేయించిన‌వారు ఉన్నార‌ని, వారిని సాక్ష్యాధారాల‌తో స‌హా కోర్టు ముందుంచాల‌నే ప‌ట్టుద‌ల‌తో సీబీఐ ఉంది.

ఆధారాల కోసం అన్వేష‌ణ‌

ఆధారాల కోసం అన్వేష‌ణ‌


వివేకా హ‌త్య కేసు ద‌ర్యాప్తు కోసం కొన్ని నెల‌లుగా పులివెందుల‌, క‌డ‌ప‌ల్లోనే మ‌కాం వేసిన అధికారుల‌ను బెదిరింపుల‌కు గురిచేయ‌డం, ప్ర‌లోభాల‌కు గురిచేయడంలాంటివి జ‌రిగాయి. కేసు ద‌ర్యాప్తు ఎంత కాలం ప‌డుతుంద‌ని కోర్టు కూడా నిల‌దీసింది. వీట‌న్నింటిని దృష్టిలో ఉంచుకొని కేసును త్వ‌రిత‌గ‌తిన ముగించేయాల‌నుకుంటున్న అధికారులు అందుకు త‌గ్గ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. కాస్తంత ఆల‌స్య‌మైనా ప‌ర్వాలేదు సాక్ష్యాధారాల‌ను గ‌ట్టిగా సేక‌రించాల‌నే ప‌ట్టుద‌ల‌తో సీబీఐ ఉంది

సాక్ష్యాధారాల‌తో స‌హా ప‌ట్టుకుంటాం

సాక్ష్యాధారాల‌తో స‌హా ప‌ట్టుకుంటాం

ద‌ర్యాప్తు ప్రారంభించే స‌మ‌యానికి సీబీఐ వైఖ‌రి ఉదాసీనంగా ఉంది. అస‌లు ద‌ర్యాప్తు జ‌రుగుతుందా? లేదా? అనే అనుమానం ప్ర‌జ‌ల్లో కూడా వ్య‌క్త‌మైంది. న‌త్త‌న‌డ‌క‌న సాగుతోందంటూ తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ ద‌ర్యాప్తు మ‌ధ్య‌లో అధికారుల‌కు ఎదురైన అనుభ‌వాలు వారిలో ప‌ట్టుద‌ల‌ను పెంచాయి.

ఎట్టి ప‌రిస్థితుల్లోను అస‌లు నిందితుల‌ను ప‌ట్టుకోవాల‌ని భావిస్తున్నారు. వివేకా హ‌త్య వెన‌క రాజ‌కీయంగా ఉన్న‌త‌స్థాయి ప‌లుకుబ‌డి క‌లిగిన వ్య‌క్తులున్నార‌ని గ‌తంలో ఛార్జిషీటులో కూడా సీబీఐ పేర్కొంది. ఆ ప‌లుకుబ‌డే త‌మ ద‌ర్యాప్తు ముందుకు సాగ‌కుండా చేస్తోంద‌ని, అస‌లు సూత్ర‌ధారుల‌ను సాక్ష్యాధారాల‌తో స‌హా ప‌ట్టుకొని కేసు ముగించేయాల‌నే యోచ‌న‌లో అధికారులు ఉన్నారు.

బెదిరింపులు ఎదురైనా వెన‌క్కి త‌గ్గేదేలే

బెదిరింపులు ఎదురైనా వెన‌క్కి త‌గ్గేదేలే


వివేకా హ‌త్య‌కేసు ద‌ర్యాప్తు ముగింపును సంచ‌ల‌నంగా మార్చాల‌ని సీబీఐ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే ఎన్ని బెదిరింపులు, ఇత‌త్రా అవ‌రోధాలు ఎదురైన‌ప్ప‌టికీ సీబీఐ అధికారుల‌కు ప‌ట్టుద‌ల‌గా ముందుకు వెళుతున్నారు. దాదాపుగా కోర్టుకు స‌మ‌ర్పించాల్సిన సాక్ష్యాధారాల‌న్నింటినీ సీబీఐ సేక‌రించింద‌ని, ముగించ‌డ‌మే త‌రువాయి అని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+