విజయసాయి రెడ్డి పారిపోతాడు: సిబిఐ భయం

ఆ పిటిషన్‌పై వాదనలు విన్న సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎన్ బాలయోగి తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టుకున్నారు. విజయసాయి రెడ్డికి అనుమతి ఇవ్వకూడదని సిబిఐ తరఫు న్యాయవాది కె. సురేందర్ కోరారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులోని పది చార్జిషీట్లలోనూ విజయసాయి రెడ్డి నిందితుడని ఆయన చెప్పారు.
ఆ పది చార్జిషీట్లపై విచారణ సందర్భంగా విజయసాయి రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. విచారణను తప్పించుకోవాలనే దురుద్దేశంతో విజయసాయి రెడ్డి తిరిగి రాకపోవచ్చునని అన్నారు. దేశం విడిచి వెళ్లడానికి విజయసాయి రెడ్డికి అనుమతి ఇవ్వకూడదని కోరారు.
కోర్టు స్వాధీనంలో ఉన్న పాస్‌పోర్టును విజయసాయి రెడ్డికి ఇవ్వకూడదని కూడా సురేందర్ కోర్టును కోరారు. బెయిల్ మంజూరు చేసిన సయమంలో కోర్టు విజయసాయి రెడ్డి పాస్‌పోర్టును తన స్వాధీనంలోకి తీసుకుంది.












Click it and Unblock the Notifications