అవినాష్ ముందస్తు బెయిల్ పై సీబీఐ అనూహ్య ట్విస్ట్, ఇక తప్పదంటూ..!!
అవినాష్ ముందస్తు బెయిల్ వ్యవహారం లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటం చాలా అవసరమని సీబీఐ పేర్కొంది. అవినాష్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును సీబీఐ తాజా అభ్యర్ధించింది. అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ను వేసవి సెలవుల అనంతరం విచారణ కు కోర్టు వాయిదా వేసింది. అత్యవసర విచారణ కు సీజే కోర్టు తిరస్కరించింది. ఈ సమయంలో సీబీఐ హైకోర్టుకు చేసిన తాజా అభ్యర్ధన కీలకంగా మారుతోంది.
అవినాష్ పాత్రపై: వైఎస్ వివేకా హత్య కేసులో తొలి నుంచి సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర పైన కీలక అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికి ఆరు సార్లు ఎంపీ అవినాష్ సీబీఐ ముందు హాజరయ్యారు. విచారణ సమయంలో కీలక అంశాలను ప్రస్తావన చేసారు. వివేకా హత్య కేసులో తనకు ప్రమేయం లేదని కోర్టుకు నివేదించారు వివేకా హత్య కేసు వెనుక ఆస్తుల వ్యవహారాలు, రెండో భార్య అంశం ఉన్నాయని కోర్టుకు వివరించారు. తొలుత అవినాష్ ముందస్తు బెయిల్ పైన హైకోర్టులో విచారణ సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటిని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ తరువాత హైకోర్టులో విచారణ జరిగినా, పూర్తి కాలేదు. వేసవి సెలవుల తరువాత విచారించిన కోర్టు నిర్ణయించింది. ఈ సమయంలో తన పిటీషన్ పైన అత్యవసర విచారణ చేయాలని సీజే కోర్టును అవినాష్ న్యాయవాదులు కోరినా అందుకు అనుమతి లభించలేదు. ఇప్పుడు హైకోర్టులో సీబీఐ తాజాగా అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ రద్దు చేయాలంటూ అభ్యర్ధించింది.

రాజకీయ కుట్ర ఉంది: హైకోర్టులో సీబీఐ తాజాగా దాఖలు చేసిన కౌంటర్ లో కీలక అంశాలను ప్రస్తావించింది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ రద్దు చేస్తే వివేకా హత్య కేసు వెనుక జరిగిన కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆయన ద్వారా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. అవినాష్ పాత్ర పైన ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని వివరించింది. గుండెపోటు అంటూ హత్యను దాచిపెట్టటం, సాక్ష్యాల విధ్వంసం, కుట్రలో అవినాష్ భాగమైనట్లు తేలినప్పటికీ సమాధానాలు ఎగవేసి, తప్పుదోవ పట్టించారని వివరించింది. దీంతో కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టుకు నివేదించింది. హత్యకు వినియోగించిన గొడ్డలి ఎక్కడ ఉందన్నది కస్డడీ లో తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది, హత్య తరువాత 2019 మార్చి 15వ తేదీ తెల్లవారు జామున 1.58 గంటలకు అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నట్లు గుగూల్ టేక్ ఔట్ ద్వారా తేలిందని సీబీఐ కోర్టుకు వివరించింది. అవినాశ్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని... ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది.

నగదు లావాదేవీలు తేలాలి:
నిందితుల మధ్య జరిగిన రూ 4 కోట్ల లావదేవీల వివరాలు, సునీల్ యాదవ్.. అవినాష్ మధ్య సంబంధం తేలాల్సి ఉందని వివరించింది. కేసు విచారణ హైదరాబాద్‌కు మారినా సాక్షులందరూ కడపకు చెందిన వారే అంటూ సీబీఐ ప్రస్తావన చేసింది. ఎవిడెన్స్ ట్యాంపరిగ్ జరుగుతోందని పేర్కొంది. అవినాష్ పైన ఉన్న కేసులను సీబీఐ ప్రస్తావించింది. తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్‌కు ఎట్టిపరిస్థితుల్లో అర్హుడు కాదని స్పష్టం చేసింది. విచారణ సమయంలో అవినాష్ దాటవేత సమాధానాలు ఇచ్చారని పేర్కొంది. అరెస్ట్ చేసి కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయటం మినహా మరో మార్గం లేదని సీబీఐ వివరించింది. పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని... అందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ పేర్కొన్నది. ఇప్పుడు అవినాష్ తరపు న్యాయవాదులు ఈ కేసులో మరోసారి వెకేషన్ బెంచ్ ను విచారణ కోసం ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications