వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివేకా హత్యకేసులో ఆమె చెప్పినవన్నీ నిజాలే: సీబీఐ

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ సుప్రీంకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు రానుండటంతో సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. సునీతారెడ్డి చెప్పినవన్నీ నిజాలేనని సీబీఐ ఇందులో స్పష్టంగా పేర్కొంది. వివేకా హత్య కేసులో రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని తెలిపింది. కేసు విచారిస్తున్న అధికారులపైనే నిందితులు కేసు పెట్టారని, సీబీఐ తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి 164 స్టేట్ మెంట్ అడిగారంటూ శంకరయ్య లేఖ రాయగా, అతనికి ప్రభుత్వం పదోన్నతిని కల్పించిందన్నారు. ఉద్దేశపూర్వకంగానే కేసు విచారణను జాప్యమయ్యేలా చూస్తున్నారని, నిందితులు ఎలా చెబితే అలా పోలీసులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

cbi files counter petition in ex minister ys vivekananda reddy murder case

తన తండ్రి, మాజీ మంత్రివైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఇక్కడ సవ్యంగా సాగదని, కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారి ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ''సీబీఐ విచారణలో ఎటువంటి పురోగతి కనిపించటం లేదని, కేసులో నిందితులుగా ఉన్న వారంతా బెయిల్‌పై బయటకు వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని, సాక్ష్యాలను చెరిపే ప్రయత్నం చేస్తున్నారని సునీతారెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసులో ఎటువంటి సహాయ సహకారాలు అందించడంలేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం.. సునీతారెడ్డి లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలంటూ సీబీఐకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయగా.. దీనిపై సీబీఐ తాజాగా కౌంటర్‌ దాఖలు చేసింది.

English summary
The CBI has filed a counter affidavit in the Supreme Court in the investigation of the murder case of former minister YS Vivekananda Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X