వివేకా హత్య కేసులో రంగంలోకి దిగిన సీబీఐ!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సీబీఐ రంగంలోకి దిగింది. కేసు విచారణను ప్రారంభించింది. పులివెందులలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వివేకానందరెడ్డి దగ్గర పీఏగా చేసిన ఇనయతుల్లాను అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్యకేసు విచారణకు ఏపీలో అడ్డంకులు ఎదురవుతున్నాయని, వేరు రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
దీంతో సాక్షులు, సీబీఐ అధికారులకు వస్తున్న బెదిరింపులపై అక్టోబరు 14లోగా సమాధానం ఇవ్వాలంటూ దర్యాప్తు సంస్థకు, ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణకు కూడా అక్టోబరు 14కే వాయిదా వేసింది.

ఆరునెలల సుదీర్ఘ విరామం తర్వాత కేసులో పురోగతి సాధించడమే లక్ష్యంగా మళ్లీ సీబీఐ బరిలోకి దిగింది. కేసులో అనుమానితుడిగా ఉన్న ఇనయతుల్లాను అధికారులు ప్రశ్నించారు. అతను వివేకాకు పీఏగా చేయడంతోపాటు కంప్యూటర్ ఆపరేటర్‌గా కూడా చేశారు. వివేకా హత్య జరిగిన మార్చి 19 2019న మొదటిసారిగా ఇంట్లోకి వెళ్లి రక్తపు మడుగులో ఉన్న మృతదేహానికి ఫొటోలు తీసింది అతనే.
ఆ ఫొటోలు ఎవరికి పంపించారు? ఫొటోలు తీసినప్పుడు ఎవరెవరున్నారు? అనే కోణంలో ప్రశ్నలు సంధించారు. పులివెందుల, కడపల్లో సీబీఐ అధికారులు గతంలో కూడా అనేకసార్లు ఇనయతుల్లాను ప్రశ్నించారు. ఇప్పుడు కూడా మొదటిసారి అతన్నే ప్రశ్నించడం గమనార్హం.












Click it and Unblock the Notifications