Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్లైమాక్స్ కు వివేకా కేసు-ఊసేలేని పెద్ద తలలు-సునీల్ ఫ్యామిలీ ప్రశ్నలతో అనుమానాలు

ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. త్వరలో ఈ కేసును ఛేదించి నిందితుల్ని అరెస్ట్ చేయొచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపిస్తూ పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. అయితే ఈ అరెస్టు తర్వాత ఆయన కుటంబ సభ్యులు చేసిన ఆరోపణలతో అసలు నిందితుల్ని సీబీఐ పట్టుకోగలదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ కేసులో మరిన్ని మలుపులు తప్పేలా లేవు.

 వివేకా హత్య కేసు దర్యాప్తు

వివేకా హత్య కేసు దర్యాప్తు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు క్లైమాక్స్ కు చేరుకుంటోంది. ఇప్పటికే వాచ్ మెన్ రంగన్న ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డితో పాటు మరికొందరు నిందితుల్ని సీబీఐ గుర్తించినట్లు ప్రచారం సాగుతోంది. అదే సమయంలో రంగన్న ఇచ్చిన వాంగ్మూలంపై ఆధారపడి సీబీఐ సునీల్ కుమార్ యాదవ్ అనే నిందితుడిని అరెస్టు చేయడమే కాకుండా కోర్టు సాయంతో కస్టడీలోకి కూడా తీసుకుంది. ఇప్పుడు ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో సునీల్ యాదవ్ పాత్రపై చర్చ జరుగుతోంది. అయితే సునీల్ యాదవ్ వంటి చిన్న వ్యక్తి ఈ హై ప్రొఫైల్ హత్య చేసి ఉంటారా లేక పాలుపంచుకుని ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సునీల్ పాత్ర గురించి పదే పదే చెప్తున్న సీబీఐ మిగతా నిందితుల వివరాలు మాత్రం బయటపెట్టడం లేదు.

 సునీల్ చుట్టూ సీబీఐ దర్యాప్తు

సునీల్ చుట్టూ సీబీఐ దర్యాప్తు

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఇప్పుడు ప్రధానంగా పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ చుట్టూనే సాగుతోంది. ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా సీబీఐ చెబుతున్న సునీల్ యాదవ్ ను ఇప్పటికే అరెస్టు చేయడంతో పాటు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో సునీల్ చెప్పే విషయాల ఆధారంగా ఇప్పుడు వివేకా కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీబీఐ అరెస్టు చేయకముందే తనను ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సునీల్ వ్యక్తం చేసిన అనుమానాలు, ఆ తర్వాత ఆయన కుటుంబం చేస్తున్న ఆరోపణలతో ఈ కేసులో ట్విస్టులు తప్పేలా లేవు.

 సునీల్ కుటుంబం సంచలన ఆరోపణలు

సునీల్ కుటుంబం సంచలన ఆరోపణలు

వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా సీబీఐ అరెస్టు చేసి ప్రశ్నిస్తున్న సునీల్ కుమార్ యాదవ్ విచారణలో ఏ అంశాలు బయటపెడుతున్నారన్నది ఉత్కంఠగా మారింది. అయితే ఇదే సమయంలో సునీల్ కుటుంబం చేస్తున్న ఆరోపణలు సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి. సునీల్ యాదవ్ ను సీబీఐ ఈ కేసులో ఇరికిస్తోందంటూ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపేలా ఉన్నాయి. ముందునుంచీ సునీల్ సీబీఐ దర్యాప్తుపై చేస్తున్న ఆరోపణలకు తోడు ఇప్పుడు కుటుంబ సభ్యులు కూటా ఆరోపణలకు తెరదీయడం సంచలనంగా మారుతోంది. దీంతో ఈ ఆరోపణలపై సీబీఐ అధికారులు ఏం సమాధానం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ సీబీఐ మాత్రం అధికారికంగా ఎలాంటి వివరాలు బయటపెట్టడం లేదు.

 పెద్ద తలకాయల్ని కాపాడేందుకే ?

పెద్ద తలకాయల్ని కాపాడేందుకే ?

వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా పేర్కొంటూ సీబీఐ అధికారులు సునీల్ యాదవ్ ను అరెస్టు చేయడంపై మండిపడుతున్న ఆయన కుటుంబ సభ్యులు పెద్ద తలకాయల్ని కాపాడేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ కారణంతోనే సునీల్ ను బలిపశువును చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ పెద్ద తలకాయలు ఎవరన్నది కూడా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే స్ధానికంగా ఉండే పలుకుబడి కలిగిన వ్యక్తులే ఇందుకు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీరి ఆరోపణలకు ప్రాధాన్యం లభిస్తోంది. ముందునుంచీ వివేకా హత్య కేసు అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో ఇందులో హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతోనే అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో సీబీఐ కూడా సునీల్ యాదవ్ పేరును మాత్రమే తెరపైకి తెచ్చి మిగతా వారిని రహస్యంగా ఉంచుతుందా అన్న అనుమానాలు సాగుతున్నాయి.

Recommended Video

    Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu
     వైఎస్ కుటుంబంపై అనుమానాల వేళ ?

    వైఎస్ కుటుంబంపై అనుమానాల వేళ ?

    వివేకా హత్య జరిగిన తర్వాత రోజు చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ కుటుంబ సభ్యుల పాత్ర ఇందులో ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా దారుణంగా జరిగిన హత్యను గుండెపోటుగా చిత్రీకరిస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అప్పట్లో వారు చెప్పిన విషయాల్ని ప్రస్తావిస్తూ సీబీఐ వద్ద వివేకా కుమార్తె సునీతారెడ్డి కొత్త అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఇదే అనుమానాలతో వివేకా కుమార్తె సునీతా రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తు కోరారు. ఇప్పుడు సునీల్ యాదవ్ ను మాత్రమే సీబీఐ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో పెద్ద తలకాయలు తప్పించుకునే అవకాశముందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ సునీల్ యాదవ్ తో పాటు మరికొందరు సాధారణ నిందితులతో ఈ కేసు దర్యాప్తు ముగించాలని సీబీఐ భావిస్తే దీన్ని వివేకా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకునే పరిస్ధితి లేదు. దీంతో ఈ కేసులో పెద్ద తలకాయల్ని సీబీఐ పట్టుకుంటుందా లేదా అన్న చర్చ సాగుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+