వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుజ‌నా చౌద‌రికి సిబిఐ స‌మ‌న్లు : బెంగుళూరులో విచార‌ణ‌ : ఆ సంస్థ‌తో సంబంధం లేదు..!

|
Google Oneindia TeluguNews

టిడిపి సీనియ‌ర్ నేత‌..కేంద్ర మాజీ మంత్రి..రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రికి సీబీఐ స‌మ‌న్లు జారీ చేసింది. 2017లో న‌మోదు చేసిన కేసులో ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. శుక్ర‌వారం బెంగుళూరు కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని అందులో సూచించారు. అయితే, సిబిఐ పేర్కొన్న కంపెనీతో త‌న‌కు సంబంధం లేద‌ని సుజ‌నా చౌదరి వివ‌ర‌ణ ఇచ్చారు.

CBI issued summons to ex central minister Sujana Chowdary : attend in bangalore office..

టిడిపి నేత‌కు స‌మ‌న్లు..
టిడిపి నేత సుజ‌నా చౌద‌రికి సీబీఐ స‌మ‌న్లు జారీ చేసింది. 2017లో న‌మోదు చేసిన కేసులో ఆయ‌న‌కు సీబీఐ బెంగుళూరు బ్రాంచ్ సమ‌న్లు జారీ చేసింది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు రూ.కోట్ల నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి సుజనా చౌదరికి చెందిన రూ. రూ.315 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌), దాని అధికారులపై సీబీఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ చర్య తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఆ సంస్థ అధికారులు 2010-2013లో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌లకు రూ.364 కోట్ల మేర నష్టం కలిగినట్లు ఈడీ పేర్కొంది.

ఆ సంస్థ‌తో సంబంధం లేదు..
సీబీఐ ఇచ్చిన స‌మ‌న్ల మీద సుజ‌నా చౌద‌రి వివ‌ర‌ణ ఇచ్చారు. 2003 నుండి తాను సుజ‌నా గ్రూపు కింద చెప్పుకొనే మూడు కీల‌క సంస్థ‌ల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో కొనసాగుతున్న విష‌యాన్ని గుర్తు చేసారు. అదే విధంగా..2014 త‌రువాత నుండి తాను ఏ కంపెనీలోనూ ఎగ్జిక్యూటివ్‌..నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో కూడా లేన‌ని స్ప‌ష్టం చేసారు. ఇక‌, సీబీఐ స‌మ‌న్లు ఇచ్చిన వ్య‌వ‌హారం అయిన క్రాంప్ట‌న్ ఇంజ‌నీరింగ్ సంస్థ‌ల‌తో త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని స్ప‌స్టం చేసారు. ఇదే విష‌యాన్ని సీబీఐకు నివేదిస్తాన‌ని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా అస‌వ‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసారు.

English summary
CBI issued summons to Ex Central Minister Sujana Chowdary in 2017 registered case. CBI called chowdary to attend beffoe officers in Banglore office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X