జగన్‌లో మరో టెన్షన్!: సీబీఐ విడిచిపెట్టదా?, హైకోర్టులో సవాల్ చేస్తే..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. సాక్ష్యులను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారన్న సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. న్యూజిలాంట్ టూర్‌కు జగన్ సిద్దమవుతున్న తరుణంలో.. విదేశీ పర్యటనలకు సైతం అనుమతినిచ్చింది.

ఇక్కడితో జగన్‌కు తాత్కాళిక ఊరట లభించినా.. సీబీఐ మాత్రం దీన్ని మరింత సీరియస్ గా తీసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు పలువురు. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో గనుక సవాల్ చేస్తే.. జగన్‌కు మళ్లీ టెన్షన్ మొదలైనట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

cbi may challenges jagan's bail petition in high court

మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డితో సాక్షి జరిపిన ఇంటర్వ్యూను పిటిషన్‌కు జతచేసి సీబీఐ దాన్ని హైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలోను ముందే అప్రమత్తమైన జగన్.. పరిస్థితి అక్కడిదాకా వెళ్తే.. ఏం చేయాలనే దానిపై న్యాయ నిపుణులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. జగన్ వర్సెస్ సీబీఐ కేసు ఎక్కడిదాకా వెళ్తుందో!

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Its an interesting discussion on Jagan's bail issue. CBI may challenges jagan's bail issue in Highcourt

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి