వివేకా హత్య కేసు- మరో నిందితుడి బెయిల్ వ్యతిరేకించిన సీబీఐ...
ఏపీలో సంచలనాలు రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న సీబీఐ.. ఈ కేసులో ఇప్పటికే బయట ఉన్న నిందితుల బెయిళ్లను రద్దు చేయించే పనిలో ఉంది. అలాగే కొత్తగా అరెస్ట్ అయిన నిందితులకు బెయిల్ దక్కకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మరో నిందితుడి బెయిల్ ను వ్యతిరేకించింది.
వివేకా హత్య కేసులో ఏ6గా సీబీఐ అరెస్టు చేసిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి తాజాగా సీబీఐ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నేపథ్యంలో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ కోరూతు పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీన్ని సీబీఐ వ్యతిరేకించింది. ఈ మేరకు సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇస్తే చోటు చేసుకోబోయే పరిణామాల్ని సైతం సీబీఐ .. కోర్టుకు వెల్లడించింది. దీనిపై సీబీఐ కోర్టు నిర్ణయం వెలువరించాల్సి ఉంది.

వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ కోర్టుకు వెల్లడించింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సన్నిహితుడైన ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పై బయటికి వస్తే సాక్ష్యులకు భద్రత ఉండబోదని సీబీఐ పేర్కొంది. వివేకా హత్యలో ఉదయ్ ప్రమేయంపై ఆధారాలు సేకరించాకే ఆయన్ను అరెస్టు చేసినట్లు సీబీఐ .. కోర్టుకు తెలిపింది.
మరోవైపు వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయంపైనా ఈ కౌంటర్ లో సీబీఐ ప్రస్తావించింది. వివేకా హత్య తర్వాత ఆధారాల ధ్వంసంలో ఆయన పాత్ర ఉందని కోర్టుకు సమర్పించిన కౌంటర్ లో పేర్కొంది. అవినాష్ కు సన్నిహితుడైన ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపైనా ప్రభావం పడుతుందని తెలిపింది. దీంతో బెయిల్ పిటిషన్ పై ఈ నెల 15న ఉత్తర్వులు ఇస్తామని కోర్టు వెల్లడించింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications