వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయపాటి సంస్థలపై సీబీఐ దాడులు: నివాసంలోనూ సోదాలు: బ్యాంకులకు భారీగా బకాయిలు..!

|
Google Oneindia TeluguNews

టీడీపీ మాజీ ఎంపీ..సీనియర్ పొలిటీషియన్ రాయపాటి సాంబశివరావు సంస్థల పైన సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్..గుంటూరులోని ఆయన కార్యాలయం..నివాసాల్లో ఈ సోదాలు సాగుతు న్నాయి. అదే విధంగా రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థలోనూ సీబీఐ సోదాలు చేస్తోంది. ఇదే సంస్థ గతంలో పోలవరం కాంట్రాక్టు దక్కించుకుంది.

అయితే, ఆర్డిక సమస్యల కారణంగా చంద్రబాబు హాయంలో ఆ సంస్థ ఆర్దిక ఇబ్బందుల కారణంగా..ఇతర కాంట్రాక్టు సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పోలవరం పనులు కొనసాగించారు. అయితే, వ్యాపారం పేరుతో బ్యాంకుల నుండి పెద్ద ఎత్తున రుణాలు తీసుకు న్న రాయపాటి వాటిని సకాలంలో తిరిగి చెల్లించకపోవటంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఆయనకు చెందిన అన్ని కార్యాలయాల్లోనూ సీబీఐ సోదాలు కొనసాగిస్తోంది.

ట్రాన్స్ట్రాయ్ కు పోలవరం కాంట్రాక్టు

ట్రాన్స్ట్రాయ్ కు పోలవరం కాంట్రాక్టు

రాయపాటి సాంబశివరావు తొలుత కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా..అయిదు సార్లు లోక్ సభ సభ్యుడిగా పని చేసారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి నర్సరావు పేట ఎంపీ గా గెలిచారు. అప్పటికే ఆయనకు సంబంధించిన ట్రాన్స్ట్రాయ్ కు పోలవరం కాంట్రాక్టు దక్కింది. అయితే, రాష్ట్ర విభజన సమయంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కానీ, ట్రాన్స్ట్రాయ్ సంస్థ ఆర్దిక ఇబ్బందులో సకాలంలో చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడింది.

నర్సరావుపేట నుండి పోటీ చేసి ఓడిపోయారు

నర్సరావుపేట నుండి పోటీ చేసి ఓడిపోయారు

దీంతో..కాంట్రాక్టర్ ను మార్చకుండానే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇతరులకు పనులు అప్పగించింది. ఇక, 2019 ఎన్నికల్లో రాయపాటి టీడీపీ నుండి తిరిగి నర్సరావుపేట నుండి పోటీ చేసి ఓడిపోయారు. అనారోగ్య సమస్యల కారణంగా టీడీపీలోనే ఉంటున్నా..రాజకీయంగా మాత్రం యాక్టివ్ గా లేరు. ఇదే సమయంలో..ఆయన వ్యాపారాల కోసం బ్యాంకుల నునండి భారీగా రుణాలు తీసుకున్నారు. వాటిని సకాలంలో చెల్లించకపోవటంతో ఆయన సంస్థల పైన సీబీఐ కేసు నమోదైంది.

హైదరాబాద్ తో పాటుగా

హైదరాబాద్ తో పాటుగా

బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించకపోవటంతో రాయపాటి సంస్థల్లో సీబీఐ సోదాలు చేస్తోంది. హైదరాబాద్ తో పాటుగా విజయవాడ..గుంటూరులోని ఆయన నివాసాలు..కార్యాలయాల్లోనూ ఈ సోదాలు కొనసాగు తున్నాయి. ఇండియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

రాయపాటితో చర్చలు

రాయపాటితో చర్చలు

గతంలోనూ రాయపాటి మీద బ్యాంకుల ఫిర్యాదులు ఉన్నాయి. 2019 ఎన్నికల తరువాత రాయపాటి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఆయన ఇంటికి స్వయంగా బీజేపీ ముఖ్య నేత రాం మాధవ్ రావటం..రాయపాటితో చర్చలు జరపటంతో ఆయన బీజేపీలో చేరిక ఖాయమని భావించారు. కానీ, రాయపాటి బీజేపీలో మాత్రం అధికారికంగా చేరలేదు. ఇప్పుడు సీబీఐ దాడులు జరగటం..చర్చనీయాంశంగా మారింది.

English summary
CBI raids on TDP ex MP Rayapati Sambasivarao offices and houses. On indian bank complaint that non repayment of loan CBI registered complaint against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X