వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కు చుక్కెదురు: రెండు పిటీషన్లు కొట్టేసిన సీబీఐ కోర్టు: వేర్వేరుగానే విచారణ..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేసిన రెండు పిటీషన్లను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. గత వారం కోర్టుకు హాజరైన జగన్..ఈ వారం హాజరు కాలేనంటూ గైర్హాజరు పిటీషన్ దాఖలు చేయగా ..దానిని కోర్టు స్వీకరించింది. మరో రెండు పిటీషన్ల విషయంలో మాత్రం జగన్ కు చెక్కెదురైంది. డిశ్చార్జి పిటిషన్లన్నంటినీ కలిపి విచారించాలని గతంలో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

సీబీఐ కేసుల విచారణ పూర్తయిన తర్వాతే ఈడీ కేసులు విచారణ జరపాలని కూడా ఆయన మరో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదనల అనంతరం డిశ్చార్జి పిటిషన్లన్నింటినీ కలిపి వినేందుకు కోర్టు నిరాకరించింది. వేర్వేరుగానే వినాలని న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

కాగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ వచ్చేవారానికి కోర్టు వాయిదా పడింది. ఈ కేసులో ఈ వారానికి జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయంపు ఇచ్చింది. దీని కోసం జగన్ ఆబ్సెంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఏ-2 నిందితుడు విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మానప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు హాజరయ్యారు.

CBi special court rejected Jagan two petitions in his assets case

జగన్ తన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఏపీకి సీఎం అయిన తర్వాత అధికారిక, ఇతరాత్ర కార్యక్రమాల వల్ల తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని గతవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోరారు. అలాగే డిశ్చార్జ్ పిటిషన్లు అన్నింటిని కలిపి విచారించాలని కూడా వేసిన పిటిషన్లపై వాదనలు గత వారం పూర్తయ్యాయి.

పెన్నా ఛార్జిషీట్‌లో అనుబంధ అభియోగ పత్రంపై ఈరోజు విచారణ ప్రక్రియను సీబీఐ కోర్టు ప్రారంభించింది. అయితే, తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ కోరగా.. ఈరోజు విచారణకు వ్యక్తిగత హాజరునుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. అనంతరం అన్ని కేసుల విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. జగన్‌కు ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు లభిస్తుందా లేదా అనే నిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

English summary
CBi special court rejected Jagan two petitions. court accepted absent petition and rejected the other two. Vijaya sai reddy and others attend the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X