AP Fake Votes Row: కలెక్టర్ తో ఆగని సస్పెన్షన్లు ఎమ్మార్వో, డీటీపైనా ఈసీ వేటు..!

ఏపీలో భారీ ఎత్తున నకిలీ ఓట్లు నమోదు చేస్తూ రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో సహకరిస్తున్న అధికారులకు ఈసీ గట్టి వార్నింగ్ ఇస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగాయన్న దానితో సంబంధం లేకుండా అక్రమాలకు సహకరించిన అధికారులపై నిర్ధాక్షిణ్యంగా వేటు వేస్తోంది. నకిలీ ఓటర్ల నమోదు, తన లాగిన్ తో భారీ ఎత్తున ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ చేసిన వ్యవహారంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ పై వేటు వేసిన ఈసీ ఇప్పుడు ఇతర అధికారుల్నీ వదలట్లేదు.

Recommended Video

    AP Fake Votes Row: కలెక్టర్ తో ఆగని సస్పెన్షన్లు EC వెరీ సీరియస్ | Telugu OneIndia

    తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా అక్రమంగా దాదాపు 30 వేల ఓట్లను నమోదు చేయించడమే కాకుండా వారి ఎపిక్ కార్డుల్ని సైతం తన లాగిన్ ఐడీతో డౌన్ లోడ్ చేసి ఇచ్చిన అప్పటి తిరుపతి మున్సిపల్ కమిషనర్, ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశపై ఈసీ సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకూ ఈ సస్పెన్షన్ వర్తిస్తుందన్నారు. విచారణ పూర్తయ్యే వరకూ ఆయన విజయవాడ విడిచి వెళ్లరాదని ఆదేశాలు ఇచ్చారు.

    CEC action continues against Fake Votes in AP, after collector, ec suspended tahsildar, DT now

    ఇంతటితో ఆగకుండా ఈసీ మరో ఇద్దరు అక్రమాలకు పాల్పడ్డ అధికారులపైనా వేటు వేసింది. అప్పట్లో తిరుపతి అర్బన్ తహసీల్దార్, ప్రస్తుతం తిరుపతి కలెక్టరేట్ లో ఈవోగా ఉన్న జయరాములుతో పాటు అప్పట్లో డిప్యూటీ తహసీల్దార్ గా, ప్రస్తుతం పుత్తూరు డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్న విజయ్ భాస్కర్ పైనా సస్పెన్షన్ వేటుకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో భూపరిపాలన కమిషనర్ ఇంతియాజ్ వీరిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వీరిద్దరినీ సైతం ముందస్తు అనుమతి లేకుండా జిల్లా కేంద్రం విడిచి వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+