ఆ రూల్ వద్దే వద్దంటున్న ఏపీ రాజకీయ పార్టీలు- సీఈసీ నిర్ణయం కోసం బ్రేక్..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు షాకిస్తూ ఎన్నికల సంఘం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. దీనిపై రాజకీయ పార్టీల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇంకా చెప్పాలంటే పార్టీలన్నీ మూకుమ్మడిగా ఈ రూల్ వద్దంటూ ఈసీకి తేల్చి చెప్పేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాని అమలుకు తాత్కాలింగా బ్రేక్ వేస్తూ సీఈవో నిర్ణయం తీసుకున్నారు. సీఈసీతో సమీక్షించి తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామంటున్నారు.
ఏపీలో రాజకీయ పార్టీలు ముందస్తు అనుమతి తీసుకున్నాకే ఇంటింటి ప్రచారానికి వెళ్లాలంటూ ఈసీ తాజాగా కొత్త రూల్ పెట్టింది. దీనిపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. సువిధ యాప్ లో ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని ఈసీ కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో సమీక్ష నిర్వహించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ముందుగా అనుమతి పొందిన తదుపరే ఇంటింటి ప్రచారానికి వెళ్లాలనే నిబంధన అమలు దుస్సాధ్యమని, ఈ నిబంధనను పున: సమీక్షించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ముక్త కంఠంతో కోరుతున్నాయని సీఈవో మీనా తెలిపారు. ఈ నిబంధన అమలు విషయంలో పలు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించడంతో పాటు, భారత ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు తెలియజేస్తామని ఆయన ప్రకటించారు. దీంతో ఈ నిబంధన ప్రస్తుకానికి అమలు కానట్లే.












Click it and Unblock the Notifications