సీఈసీ మరో సంచలనం : ప్రకాశం జిల్లా ఎస్పీపై బదిలీ వేటు, మంగళగిరి, తాడేపల్లి సీఐపై కూడా,
అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేస్తోంది. ఐపీఎస్ ట్రాన్స్‌ఫర్‌తో మొదలైన బదిలీ వేటు .. ఐబీ చీఫ్, ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా వదలలేదు. తాజాగా ఇవాళ ప్రకాశం ఎస్పీ ప్రవీణ్, మంగళగిరి, తాడేపల్లి సీఐలను ట్రాన్స్‌ఫర్ చేసింది.
ప్రకాశం ఎస్పీపై బదిలీవేటు
ఏపీలో అధికారుల బదిలీ అలజడి రేపుతోంది. ఇవాళ ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రవీణ్‌పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సిద్ధార్థ్ కౌశిక్‌కు ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది. ఎన్నికలకు మరో 36 గంటల సమయం ఉండగా బదిలీ చేయడం కలకలం రేపుతోంది. ప్రకాశం ఎస్పీతోపాటు రాజధాని పరిధిలోని మంగళగిరి సీఐపై కూడా ఈసీ కొరఢా ఝలిపించింది. తాడపల్లి సీఐ శ్రీనివాసరావును ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆయన స్థానంలో సురేశ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.

సీఎస్‌పై కొరఢా
కడప, శ్రీకాకుళం ఎస్పీలు రాహుల్‌దేవ్ శర్మ, వెంకటరత్నం, ఏపీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారం అప్పటి సీఎప్ అనిల్‌చంద్ర పునేఠ మెడకు చుట్టుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో కడప, శ్రీకాకుళం జిల్లా ఎస్పీలను బదిలీచేసినా .. సీఎస్, ఐబీ చీఫ్ బదిలీ చేయలేదు. దీంతో ఆగ్రహించిన కేంద్ర ఎన్నికల సంఘం మీపై చర్యలు ఎందుకు తీసుకొకూడదో తెలుపాలని కోరింది. ఆ తర్వాత సీఎస్‌ను కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించి ... ఎల్వీ సుబ్రమణ్యంకు బాధ్యతలు అప్పగించింది.
ఏబీ చీఫ్, ఎస్పీలు బదిలీ
ఎన్నికల వేళ ఏపీలో అధికారుల బదిలీ ప్రకంపనలు రేపుతోంది. విపక్ష వైసీపీ ఫిర్యాదుతో ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని అధికార టీడీపీ ఆరోపించింది. కడప, శ్రీకాకుళం ఎస్పీ పనితీరు అనుమానంతో బదిలీ చేసింది. ఆ సమయంలోనే ఏబీ చీఫ్ వెంకటేశ్వరరావుపై కూడా బదిలీ వేటు వేసింది. అయితే ఏపీ సర్కార్ తెలివిగా వ్యవహరించి .. ఎస్పీలను రిలీవ్ చేసి, ఏబీ చీఫ్ బదిలీని మాత్రం హోల్డ్ లో పెట్టింది. దీంతో ఏపీ ప్రభుత్వ వైఖరిపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సీఎస్‌కు సమన్లు జారీచేసింది. కానీ సీఎస్ వివరణతో సంతృప్తి చెందని ఈసీ ... ఆయనను కూడా విధుల నుంచి తప్పించింది.












Click it and Unblock the Notifications