వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసుల ఉప‌సంహ‌ర‌ణ ఎలా చేస్తారు : ఈసీకి ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ఫిర్యాదు..!

|
Google Oneindia TeluguNews

ఏపి లో టిడిపి ప్ర‌భుత్వ అధికారంలోకి వ‌చ్చిన త‌మ పార్టీకి చెందిన వారి పై ఉన్న పెండింగ్ కేసుల ప్రాసిక్యూష‌న్ ఉప సంహ రించుకుంటూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనిని సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ తప్పు బ‌ట్టింది. విచార‌ణ పూర్తి కాకుం డా..వారి పై ప్రాసిక్యూష‌న్ ఎలా ఉప‌సంహరించుకుంటార‌ని ప్ర‌శ్నించింది. గ‌తంలో ఇచ్చిన ఫిర్యాదును గుర్తు చేస్తూ తాజా గా మ‌రో లేఖ ను ఎన్నిక‌ల సంఘానికి సంస్థ ప్రతినిధులు అంద‌చేసారు.

Center for Good Governence lodge complaint to E.C : Asked Acton against Ap Givt on cases with draw

ప్రాసిక్యూష‌న్ విత్ డ్రా ఉత్త‌ర్వులు..

ఏపిలో టిడిపి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తొలి ఏడాది కాలంలోనే వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంది. సొంత పార్టీకి చెందిన అనేక మంది నేత‌ల పై అప్ప‌టికే పెండింగ్ లో ఉన్న ప‌లు కేసుల‌ను ఉప సంహ‌రిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అందులో అనేక మంది టిడిపి సీనియ‌ర నేత‌లు ఉన్నారు. మంత్రులు..ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నా రు. వీరంద‌రి పైనా కేసులు ఉపసంహ‌రిస్తూ ఏపి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అప్ప‌ట్లోనే దీని పై రాజ‌కీయంగా పెద్ద దుమారమే రేగింది. మంత్రులుగా ఉన్న అచ్చంనాయుడు, దేవినేని ఉమా, గంటా శ్రీనివాస‌రావు వంటి వారితో పాటు గా ప‌లువురు పార్టీ నేత‌లు ఉన్నారు. క‌ర‌ణం బ‌లరాం, కోడెల శివ ప్ర‌సాద రావు, బాల‌కృష్ణ వంటి వారి పైన ఉన్న కేసులను ప్ర‌భుత్వం ఎత్తి వేసింది. ప్ర‌భుత్వం ప్రాసిక్యూష‌న్ ఉప సంహ‌రించుకున్న వారంతా టిడిపి కి సంబంధించిన వారే కావ‌టం తో దీని పై అప్ప‌ట్లోనే పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది.

ఇసి ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ఫిర్యాదు..

ఈ ర‌కంగా ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా తీసుకున్న నిర్ణ‌యం పై సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ 2017 మే లో ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇసి తో పాటుగా కేంద్ర హోం, న్యాయ శాఖ‌ల‌కు ఫిర్యాదు పంపింది. సంస్థ పంపిన ఫిర్యాదు పై ఇసి నుండి లేఖ సైతం వ‌చ్చింది. అయితే, ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇప్పుడు ఏపిలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ ..తిరిగి సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ మ‌రో సారి ఇదే అంశం పై ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసింది. అభ్య‌ర్దులు నామినేష న్లు దాఖ‌లు చేయ‌టం...ప‌రిశీల‌న పూర్తి కావ‌టంతో ఇప్పుడు ఈ సంస్థ కేసుల గురించి ఫిర్యాదు చేయ‌టం పై చ‌ర్చ సాగు తోంది. ఇప్పుడు ఎన్నిక‌ల సంఘం దీని పై ఏ ర‌కంగా స్పందిస్తుద‌నేది ఆసక్తి క‌రంగా మారింది.

English summary
Center for good governence complain to election commission on Ap Govt with draw prosecution on TDP leaders. In 2015 Govt given orders on this matter. Center for good governence again complaint to E.C for action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X