ఏపీ రాజధానిపై కేంద్రం స్టాండ్.. బీజేపీ విధానం ఇదేనట!!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ ఫైవ్ జోన్లో ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమం తర్వాత ఏపీలో రాజధాని అమరావతి పై మళ్లీ చర్చ కొనసాగుతుంది. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడానికి ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేశారని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ఏపీ సీఎం జగన్ పై విరుచుకు పడుతున్నాయి.

ఇక ఇదే సమయంలో త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ప్రారంభమవుతుందని వైవి సుబ్బారెడ్డి లాంటి నేతలు చెప్పడం కూడా రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ రాజధానిపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

n AP capital.

ఏపీని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఏపీకి కేంద్రం ఏమి చేయడం లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రానికి కేంద్రం అత్యధిక ఇళ్లను కేటాయించిందని పురందేశ్వరి పేర్కొన్నారు.

అమరావతిలోని ఆర్ 5 జోన్లో పేదల ఇళ్లకు నిర్మాణం అనే అంశం కోర్టులో ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు తాము పేదలు మరియు అమరావతి రైతులు ఇద్దరు పక్షం ఉన్నామని, పేదలకు ఇల్లు ఇవ్వద్దని తాము ఎక్కడా చెప్పలేదని పురందేశ్వరి పేర్కొన్నారు . అంతేకాదు రాష్ట్రంలోనే కాదు అక్కడ నిర్మాణం అవుతున్న ఇళ్లలో ప్రతి ఇంటికి 1.8లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

ఏపీలో ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తామని ఏపీలో వచ్చే ఎన్నికల పొత్తుల పైన అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురందేశ్వరి పేర్కొన్నారు. ఏది ఏమైనా రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నట్టు కేంద్రం స్టాండ్ ను చెప్పడంతో పాటు, తమ విధానం, తమ నినాదం రాజధానిగా అమరావతి నే నని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మరో మారు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+