బాబు ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం: విచారణకు ఆదేశం
అమరావతి: ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంభాణషలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై బుధవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంతేకాదు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై శాఖాపరమైన విచారణకు కేంద్రం ఆదేశించింది. బుధవారం రాత్రి ప్రధాని కార్యాలయం నుంచి ఈ మేరకు ఆదేశాలు వెలువడినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏ శాఖ విచారణ చేపట్టాలనేది కూడా త్వరలో స్పష్టత రానుంది.

ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ కేంద్ర హోం శాఖ లేదా టెలికమ్యూనికేషన్లశాఖ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి, రాష్ట్రపతితో ఏపీ చంద్రబాబు నాయుడు భేటీ అయి చర్చించిన సంగతి తెలిసిందే.
ఈ భేటీలో ఏపీ సీఎంతో సహా 120 మంది ప్రముఖుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని దీనిపై విచారణ జరపాలని ప్రధాని మోడీని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు మేరకు, ఫోన్‌ట్యాపింగ్‌పై అంతర్గత విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications