ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను చూసి నేర్చుకోండి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేర్చుకోవాలంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ హితవు పలికారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ఈ దేశానికి రెండుసార్లు ఎన్నికయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మోడీకి ఏవిధంగా స్వాగతం పలికారో, ఏవిధంగా గౌరవం ఇచ్చారో అదే తరహాలో ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారని, ఆ విషయం మరిచిపోకూడదన్నారు.
అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణకు హైదరాబాద్ నుంచి భీమవరానికి చేరుకున్న ప్రధానమంత్రి మోడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఆయనతోపాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా స్వాగతం పలికినవారిలో ఉన్నారు. స్టేజీమీద కూడా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చారు.

హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలంగాణ పశుసంవర్ధకశాక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లలేదు. ఇరు పార్టీల మధ్య రాజకీయంగా హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని బీజేపీ నేతలు చెబుతుండగా, మూడోసారి కూడా తమదే అధికారమని తెలంగాణ రాష్ట్ర సమితి చెబుతోంది.
దీంతోపాటు జాతీయపార్టీ పెట్టి నరేంద్రమోడీని దింపే ప్రయత్నం చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఇలా ఈ రెండుపార్టీలు తెలంగాణలో అధికారం కోసం మదగజాల్లా తలపడుతున్నాయి. దీంతో బీజేపీ పొడ అంటే గిట్టని విధంగా కేసీఆర్ ఉన్నారు. ప్రతిరోజు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటువంటి తరుణంలోనే హైదరాబాద్‌కు వచ్చిన మోడీకి స్వాగతం చెప్పడానికి ఆయన తన తరఫున మంత్రి తలసానిని పంపించారు. ఈ విషయమై ధర్మేంద్రప్రదాన్ కేసీఆర్‌కు హితవు పలికారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications