సర్క్యులర్ జారీచేసిన కేంద్రం.. ఏప్రిల్ 1 నుంచి అమలు!
కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు పలు పథకాలను అమలు చేస్తోంది. తాజాగా ఒక స్కీమ్ లో పెట్టుబడి పెట్టాల్సిన మొత్తాన్ని పెంచింది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లో ప్రస్తుతం రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. దాన్ని రూ.30 లక్షలకు పెంచింది. బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. తాజాగా కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది.
వృద్ధులకు వారు పెట్టుబడి పెట్టినవాటితో నెలా నెలా ఆదాయాన్నిచ్చేందుకు 2004లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నిర్ణయం వృద్ధులకు ఎంతో మేలు చేయనుంది. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వచ్చిన డబ్బులను ఈ పథకంలో పెట్టుబడిగా పెడితే నెలనెలా వారికి కొంత ఆదాయం ఉన్నట్లవుతుందని కేంద్రం భావించింది. ఈ పథకంలో మార్చి 31 వరకు ఉన్న లిమిట్ ప్రకారం చూస్తే రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టినవారికి 8 శాతం వార్షిక వడ్డీ ఇస్తోంది. 5 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.

దీనిప్రకారం.. ప్రతి సంవత్సరం రూ.1,20,000 వడ్డీ లభిస్తుంది. 5 సంవత్సరాలకు రూ.6,00,000 వడ్డీ వస్తుంది. నెలనెలా బ్యాంకు ఖాతాలో రూ.10,000 చొప్పున జమచేస్తారు. సీనియర్ సిటిజన్లకు ఇది పింఛనులా ఉపయోగపడుతుంది. తాజాగా పెంచిన లిమిట్ ప్రకారం చూస్తే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రూ.30 లక్షలు పెట్టుబడిగా పెట్టొచ్చు. వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచి 8.20 శాతం చేసింది. ఈ వడ్డీ ప్రకారం వార్షికంగా ఎంత మొత్తం వస్తుందని చూస్తే ప్రతి ఏడాది రూ.2.46 లక్షలు వడ్డీగా వస్తుంది. 5 సంవత్సరాలకు రూ.12,30,000 పొందొచ్చు.
ప్రతీ నెలా అకౌంట్‌లో రూ.20,500 చొప్పున జమవుతుంది. 5 సంవత్సరాలపాటు నెలకు రూ.20,500 చొప్పున పొందొచ్చు. గడువు పూర్తయిన తర్వాత పెట్టుబడిగా పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి. ఇందులో పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. గరిష్టంగా రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. రూ.50,000 వరకు వడ్డీకి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టి తర్వాత కావాలనుకుంటే మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications