నెరవేరిన సీఎం జగన్ కోరిక - ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో వరం..!!
సీఎం జగన్ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..కేంద్రం మరో వరం ప్రకటించింది. ఏకంగా ఏపీకి రూ 9,009 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి జగన్ అందించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఏపీలో వీటిని గ్రౌండ్ చేసేందుకు ముహూర్తం నిర్ణయించింది. రాయలసీమ ప్రాంతంలో ఏకంగా ఒకేసారి తొమ్మిది జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నెల 28న ఈ పనులకు భూమిపూజ చేయాలని నిర్ణయించింది.

సీఎం ప్రతిపాదనలను యదాతధంగా..
ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. జాతీయ రహదారుల ప్రతిపాదనలను స్వయంగా అందించారు. దీని పైన స్పందించిన కేంద్రం వెంటనే వాటికి ఆమోద ముద్ర వేసింది. తొలి విడతలో భాగంగా కొద్ది నెలల క్రితం విజయవాడ వేదికగా దాదాపు రూ 15 వేల కోట్లతో నిర్మించనున్న జాతీయ రహదారులకు సీఎం జగన్ - కేంద్ర మంత్రి గడ్కరీ భూమి పూజ చేసారు. ఇప్పుడు రెండో దశ కింద రాయలసీమకు కొత్తగా మొత్తం 411 కిలో మీటర్ల నిడివి ఉన్న ఈ రహదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్ర యధావిధిగా ఆమోదించింది. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేసే వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను కేంద్రానికి ప్రతిపాదించింది.

తిరుపతి కేంద్రంగా భూమి పూజ..
ఈ నిర్మాణానాలకు ఈ నెల 28వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుపతిలో భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే రూ 204 కోట్లతో 19 కిలో మీటర్ల మేర నిర్మించిన రెండు జాతీయ రహదారులను కేంద్ర మంత్రి ప్రారంభిస్తారు. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. 27వ తేదీన ఆయన తిరుమల చేరుకుంటారు. 28వ తేదీ తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. ఆ తరువాత తిరుపతిలో జరిగే జాతీయ రహదారుల భూమిపూజలో పాల్గొంటారు. ఏపీకి సంబంధించి రోడ్లు - మౌళిక వసతుల కల్పనలో పూర్తి సహకారం అందిస్తామని గతంలోనే ఢిల్లీలో తనను సీఎం జగన్ కలిసిన సమయంలో నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. అందులో బాగంగా... ఏపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు వెంటనే ఆమోద ముద్ర వేస్తున్నారు.

రాయలసీమ ప్రాంతానికి మేలు చేసేలా
ప్రధాని మోదీ విశాఖ పర్యటన సమయంలోనూ ఏపీకి సంబంధించిన అంశాల పైన సీఎం జగన్ మరోసారి ప్రస్తావించారు. అందులో భాగంగా అటు ఉత్తరాంధ్ర..ఇటు రాయలసీమ ప్రాంతాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్రం వద్ద ప్రతిపాదనలను అందించింది. వీటికి సంబంధించి ఆమోదముద్ర వేయాలని కోరింది. సీఎం జగన్ చేసిన ప్రతిపాదనలను యదాతధంగా ఆమోద ముద్ర వేయటాన్ని అధికారులు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా భారీ మొత్తంలో నిధుల కేటాయించిన తాజా ప్యాకేజీలో మదనపల్లి - పీలేరు - తిరుపతి నాలుగు లేన్ల రహదారి 94 కిలో మీటర్ల మేర నిర్మాణం కానుంది. అదే విధంగా..మైదుకూరు - బద్వేలు సెక్షన్ నాలుగు లేన్ల రహదారికి ఆమోదం దక్కింది. కడప - నెల్లూరు జిల్లా సరిహద్దు నుంచి సీఎస్ పుర్ వరకు పాన్డ్ సోలర్డర్స్ లో రెండు లేన్ల రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
ఈ నెల 30 నుంచి తిరుమలలో -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications