వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జ‌గ‌న్ వ‌ర్సెస్ కేంద్రం: వ‌్య‌వ‌హారం ముదురుతోంది: కేంద్ర సంస్థ‌ల స‌హాయ నిరాక‌ర‌ణ‌..!

|
Google Oneindia TeluguNews

క్ర‌మంగా కేంద్రం..ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంది. పీపీఏల విష‌యంలో కేంద్రం వ‌ద్ద‌ని చెప్ప‌టం..ఏపీ సీఎం గ‌న్ స‌మీక్ష విష‌యంలో వెన‌క్కు త‌గ్గ‌క‌పోవ‌టంతో ఈ వ్య‌వ‌హారం ముదురుతోంది. దీంతో..శాస‌న‌స‌భా వేదిక‌గా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో ఏం జ‌రిగింద‌నే దాని పైన ముఖ్య‌మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు. అదే స‌మ‌యంలో విద్యుత్ ఒప్పం దాల పైన రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. అయితే, ఈ స‌మీక్ష‌కు కేంద్ర విద్యుత్ సంస్థ‌లు హాజరు కాకూడ‌ద‌న నిర్ణ‌యించాయి. కానీ, ఏపీ సీఎం జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యం పైన వెన‌కడుగు లేద‌ని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ఏ ట‌ర్న్ తీసుకుంటుందోన‌నే ఉత్కంఠ మొద‌లైంది.

Recommended Video

రైతుల పై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్
జ‌గ‌న్ వ‌ర్సెస్ కేంద్రం..

జ‌గ‌న్ వ‌ర్సెస్ కేంద్రం..

విద్యుత్ కొనుగోళ్ల అంశం ఇప్పుడు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌..కేంద్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య వార్‌గా మారింది .విద్యుత్ కొను గోళ్ల పైన స‌మీక్ష వ‌ద్ద‌ని కేంద్ర‌..చేయాల్సిందేన‌ని జ‌గ‌న్ ప‌ట్టుబ‌డుతున్నారు. జ‌గ‌న్ దీని పైన నిర్ణ‌యాన్ని మార్చుకొనే ప‌రిస్థితులు లేక‌పోవ‌టంతొ కేంద్రం స‌హాయ నిరాక‌ర‌ణ ప్రారంభించారు. విద్యుత్ ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాల‌ని నిర్ణ‌యించింది.ఈ స‌మీక్ష‌కు హాజ‌ర‌వ్వాల‌ని ఏపీ ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని విద్యుత్ సంస్థ‌ల‌ను ఆహ్వానించింది. కానీ,ఈ సమీక్షకు హాజరుకాకూడదని కేంద్ర విద్యుత్ సంస్థలు ఎన్టీపీసీ, ఎస్‌ఈసీఐ నిర్ణయం తీసుకున్నాయి. ఒప్పందాలు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఒప్పందాలను గౌరవించి, పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిస్కంలకు ఎస్ ఈసీఐ లేఖ రాసింది. దీని ద్వారా ప‌రోక్షంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద ఒత్తిడి పెరిగేలా కేంద్రం ఇంధ‌న శాఖ వేస్తున్న అడుగులు స్ప‌ష్టం చేస్తున్నాయి.

కేంద్రం చెబుతున్న జ‌గ‌న్ త‌గ్గ‌ట్లేదు..

కేంద్రం చెబుతున్న జ‌గ‌న్ త‌గ్గ‌ట్లేదు..

చంద్ర‌బాబు హాయంలో జ‌రిగిన విద్యుత్ ఒప్పందాల స‌మీక్ష కోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌మిటీ ఏర్పాటు చేసారు. దీని పైన శాస‌న‌స‌భ‌లోనూ చ‌ర్చ జ‌రిగింది. చంద్ర‌బాబు హాయంలో కేవ‌లం అయిదు సంస్థ‌లే మెజార్టీ పీపీఏలు ద‌క్కించుకు న్నాయ‌ని వివ‌రించారు. ప్ర‌తీ ఏటా చేసిన ఖ‌ర్చును లెక్క‌ల‌తో విశ్లేషించారు. దీని పైన గ‌తంలోనే కేంద్ర ఇంధ‌న శాఖ కార్య‌ద‌ర్శి..ఆ త‌రువాత నేరుగా కేంద్ర మంత్రి ఏపీ ముఖ్య‌మంత్రికి లేఖ రాసారు. దీని పైన ఏపీ ప్ర‌భుత్వ స‌లహాదారుడి గా వ్య‌వ‌హ‌రిస్తున్న అజ‌య్ క‌ళ్లాం తాము ఎందుకు స‌మీక్ష చేప‌డుతుందీ వివ‌రించారు. దీని పైన మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. అనాలోచిత చ‌ర్య‌లతో ఏపీని అంధ‌కారం చేయ‌వ‌ద్దంటూ సూచించారు. క‌మిటీ నివేదిక ఇవ్వ‌లేద‌ని చెబుతూనే..ముఖ్య‌మంత్రి స‌భ‌లో పీపీల్లో అవినీతి జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేసారు. కానీ ఎక్క‌డా కేంద్రం చేసిన సూచ‌న‌లు..త‌న వైఖ‌రి ఏంట‌నేది జ‌గ‌న్ ఎక్క‌డా స్ప‌ష్టం చేయ‌లేదు.

కేంద్రంతో గ్యాప్ పెరుగుతోందా..

కేంద్రంతో గ్యాప్ పెరుగుతోందా..

ముఖ్య‌మంత్రి పీపీల విష‌యంలో చూపిస్తున్న ప‌ట్టుద‌ల ఇప్పుడు కేంద్రానికి రుచించ‌టం లేదు. తొలుత కేంద్ర ఇంధ న శాఖా కార్య‌ద‌ర్శి లేఖ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నేరుగా ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు. అవినీతి జరిగి ఉంటే ఖ‌చ్చితంగా విచార‌ణ జ‌ర‌గాల్సిందేన‌ని ప్ర‌ధాని సైతం వ్యాఖ్యానించిట్లు స‌మాచారం. దీంతో..జ‌గ‌న్ పీపీఏల సమీక్ష కోసం క‌మిటీ సైతం ఏర్పాటు చేసారు. కానీ, ఇప్పుడు ఈ వైఖ‌రి మీద కేంద్ర ఇంధ‌న మంత్రి ఆగ్ర‌హంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయ‌న సూచ‌న‌ల మేర‌కే రాష్ట్ర ప్రుభుత్వం ఏర్పాటు చేసిన స‌మీక్ష‌కు కేంద్ర విద్యుత్ సంస్థ‌ల అధికారులు హాజ‌రు కాలేద‌ని స‌మాచారం. మ‌రి..ముదురుతున్న ఈ వ్య‌వ‌హారంలో సీఎం జ‌గ‌న్ త‌రువాతి అడుగులు ఏ ర‌కంగా వేస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారుతోంది.

English summary
Central Govt serious on CM Jagan decision on Review of PPA taken place in Chandra babu Tenure. Central power companies did not attend for AP Govt review.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X