ఆ నగలకు వీటికి పోలికే లేదా?... తిరుమల శ్రీవారి ఆభరణాలపై కేంద్ర సమాచార కమిషన్ ప్రశ్న
న్యూ ఢిల్లీ: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టీటీడీని కేంద్ర సమాచార కమిషన్ ప్రశ్నించింది.
శాసనాల్లో ఉన్న నగలకు ప్రస్తుతం అక్కడ ఉన్న నగలకు పోలిక లేదని ఆర్కియాలజీ డైరెక్టర్ తనతో చెప్పినట్లు కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ వెల్లడించారు. వేల కోట్లు ఖర్చుచేసే ప్రభుత్వ సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై మధ్యంతర ఉత్తర్వులిచ్చానని...అయితే ప్రభుత్వం జవాబుదారీగా ఉండటానికి తనకు ఉన్న అభ్యంతరాలను చెప్పుకోవచ్చని మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు.

శ్రీవారి ఆభరణాలపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పలు ఆరోపణలు, సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు పింక్ వజ్రాన్ని దేశం దాటించారని ఆయన ఆరోపించారు. అయితే రమణదీక్షితులను టీటీడీ కొట్టిపారేసింది. ఆయన ఆరోపణల్లో నిజం లేదని టీటీడీ చైర్మన్ సింఘాల్ తెలిపారు. వజ్రానికి సంబంధించి ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పుడు నోరెత్తకుండా రిటైరయ్యాక విమర్శించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సింఘాల్ వ్యాఖ్యానించారు.
మరోవైపు రమణ దీక్షితుల ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. రమణదీక్షితులు టీటీడీ పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన అర్చకుడిగా తనకు తప్ప వేరొకరికి అవకాశం రాకూడదన్న దురుద్దేశంతో రమణదీక్షితులు వ్యవహరిస్తున్నారని, గతంలో ఆయన అనేక తప్పులు చేశారని రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి ఆరోపిస్తోంది.
అయితే రమణ దీక్షితులు తన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర సమాచార కమిషన్ ను కూడా ఆశ్రయించారు. దీంతో స్పందించిన కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఈ విషయమై సెప్టెంబర్ 28న తుది విచారణ చేపడుతామని...దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications