అమరావతి రుణంపై కేంద్రం కొత్త మెలిక - మినహాయింపు.!!
ఏపీ రాజధాని అమరావతి పై నిర్ణయాలు వేగ వంతమయ్యాయి. కేంద్రం అమరావతికి రూ 15 వేల కోట్లను రుణం ఇప్పిస్తామని బడ్జెట్ లో ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అధికారులు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అమరావతిలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. అమరావతి రుణం కు సంబంధించి కేంద్రం ఏపీకి తాజాగా కీలక ప్రతిపాదన చేసింది. ఒక వైపు రుణం బాధ్యత కేంద్రం తీసుకుంటూనే రాష్ట్ర నిధుల నుంచి మినహాయించాలని డిసైడ్ అయింది.
రుణంపై చర్చలు
అమరావతి నిధుల విషయంలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. అమరావతికి రుణం పైన అటు కేంద్రం..ఇటు రాష్ట్రం సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. తాజాగా అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు ద్వారా ఇప్పిస్తున్న రూ.15 వేల కోటను రాష్ట్ర వాటా నిధుల నుండి కేంద్ర ప్రభుత్వం మినహాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతీ సంవత్సరం బడ్జెట్లోనే మినహాయింపులను చూపాలని ఒప్పందం చేసుకున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిధులకు కౌంటర్ గ్యారంటీ ఇచ్చిన కేంద్రం ఏడాది వాటాతోపాటు, వడ్డీని కూడా ప్రపంచబ్యాంకకు చెల్లించేందుకు బాధ్యత తీసుకుంది. కానీ, ఈ మొత్తాన్ని రాష్ట్ర వాటాగా ఇచ్చే నిధుల నుండే చెల్లించనుంది. ఈ మేరకు ప్రాథమిక అంగీకారం కుదిరినట్లు తెలిసింది.

తొలి విడతగా
అమరావతికి ఇచ్చే రుణంలో ఇప్పటికే రూ.3000 కోట్లును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని సమాచారం. దీంతో వచ్చేనెల మొదటి వారంలోనే ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు చెల్లించనున్నారు. ఈవారంలో రాజధాని పరిధిలో ప్రపంచబ్యాంకు బృందం పర్యటలను పూర్తి చేసుకోనునుంది. అప్పటి వరకూ రైతుల నుండి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చూసేందుకు మున్సిపల్ పట్టణాభివృద్దిశాఖ మంత్రి నారాయణ ఫోకస్ చేసారు. రైతులను పిలిపించి ప్రభుత్వం నుంచి రావాల్సిన చెల్లింపుల పై హామీ ఇచ్చారు. ప్రపంచబ్యాంకు పర్యటిస్తుడటం నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సీఆర్డీఏ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రతిపాదనలు సిద్దం
గతంలో 2016-19 మధ్యలో ప్రపంచబ్యాంకు సభ్యులు వస్తే రైతులను పిలిచించి మాట్లాడిన ఫ్రభుత్వం ప్రస్తుతం అటువంటి చర్యలు తీసుకోలేదు. పర్యటన మొత్తం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు ప్రపంచబ్యాంకు నిధులు రూ.15 వేల కోట్లు వచ్చేలోపు ముందే కొంత మొత్తాన్ని కేంద్రం రాష్ట్రానికి కేటాయించనుంది. వాస్తవంగా కనీసం మూడు నుండి ఐదేళ్లలోపు నిధుల తిరిగి చెల్లింపులకు మారటోరియం ఉంటుంది. మారటోరయం తరువాత చెల్లింపుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు బడ్జెట్లోనే తగ్గింపులు చూపించేలా రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications