కృష్ణయ్యకు కేంద్రం కీలక పదవి - కాంగ్రెస్ తాజా ఆఫర్..!!
వైసీపీ ఎంపీగా రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకు కేంద్రం కీలక పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతుంది. వైసీపీకి రాజీనామా చేసి వస్తే జాతీయస్థాయిలో కీలక పదవి ఇస్తామని బిజెపి ముఖ్య నేతలు ఆఫర్ ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. కేంద్రం కీలక పదవి ఇవ్వనున్న వేళ కాంగ్రెస్ నుంచి కృష్ణయ్యకు తాజా ఆఫర్ అందింది.
బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య వైసిపి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ రాజ్యసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపీగా ఉన్న సమయంలోనే బిజెపి ముఖ్య నేతలు కృష్ణయ్యతో టచ్ లోకి వెళ్లారు. విద్యార్థి సంఘ నేతగా ఉన్న సమయం నుంచి బిజెపి అనుబంధ సంఘాలు, ఆ పార్టీ నేతలతో కృష్ణయ్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

తెలంగాణలో బీసీ నినాదంతో బిజెపి మరింత బలపడాలని ప్రయత్నం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి బీసీ సీఎం నినాదం వినిపిస్తుంది. బీసీ సంఘాల నేతగా ఉన్న కృష్ణయ్యను దగ్గరికి తీసుకోవడం ద్వారా మరింత రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని బిజెపి ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా కృష్ణయ్యకు బిజెపి కీలక పదవి కట్టబెట్టేందుకు సిద్ధమైంది.
ఇప్పుడు రాజ్యసభకు రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకు కేంద్రం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా నియమించే అవకాశం ఉందని బిజెపి ముఖ్య నేతల్లో ప్రచారం జరుగుతుంది. బీసీ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని తాజాగా జరిగిన సమావేశంలో పలు బీసీ సంఘాలు కృష్ణయ్యను కోరాయి. ఈ సమయంలోనే బిజెపి ముఖ్య నేతలు కృష్ణయ్యతో మంత్రాంగం ప్రారంభించారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇప్పుడు కృష్ణయ్యకు కీలక పదవి కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో బీసీ ఓట్ బ్యాంక్ మరింత పెంచుకోవాలని ఆ పార్టీ నేతల ఆలోచనగా తెలుస్తుంది. అందులో భాగంగా కృష్ణయ్యకు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమిస్తారని సంకేతాలు అందుతున్నాయి.
ఇటు కృష్ణయ్యను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తాజాగా కృష్ణయ్యతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ లోకి రావాలని తగిన ప్రాధాన్యతతో పాటు కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆఫర్ ఇచ్చారు. అటు బీసీ సంఘాల నుంచి కొత్త పార్టీ ఏర్పాటు కోసం కృష్ణయ్య పైన ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు కృష్ణయ్య ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతుంది.












Click it and Unblock the Notifications