ప్రధాని అన్నారు, అదే అంటున్నాం: విభజనపై బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం నాటకాలు మానాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల క్రితం ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణ జఠిలమైన సమస్య అని, అందరితో చర్చించాకే తగిన పరిష్కారం వస్తుందని ప్రధాని అన్నట్లు చంద్రబాబు తెలిపారు. నాడు ప్రధాని చెప్పిన మాటలే నేడు మేం చెబుతున్నామని ఆయన అన్నారు. ఒకప్పుడు చెప్పిన మాటలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కట్టుబడి ఉంటారా? అని ప్రశ్నించారు. కిరణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

విభజనపై కేంద్రానికి ముఖ్యమంత్రి కిరణే సమాచారం అందజేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకే ఢిల్లీ వెళ్లారని చంద్రబాబు ఆరోపించారు. కాంగ్రె, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు కుమ్మక్కు రాజకీయాలను నివారించేందుకు బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తొలి బహిరంగ సభను తిరుపతిలో నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను చంద్రబాబు అభినందించారు. సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సచిన్ టెండూల్కర్‌ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.సచిన్ టెండూల్కర్ ఆటతోపాటు గొప్ప విలువలు నెలకొల్పిన మహోన్నత వ్యక్తి అని చంద్రబాబు కొనియాడారు. సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ఇవ్వడం దేశాన్ని, జాతిని గౌరవించుకున్నట్లని ఆయన పేర్కొన్నారు.
శివసేనలా టిఆర్ఎస్: మాజీ డిజిపి అంజనేయరెడ్డి
తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్లు ఉన్నారని రాష్ట్ర మాజీ డిజిపి అంజనేయ రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజిస్తే నక్సలైట్ల ప్రభావం పెరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి తన కూతురు, కొడుక్కి దోచిపెట్టేందుకే తెలంగాణ రాష్ట్రం కోరుతున్నారని అంజనేయరెడ్డి ఆరోపించారు. మహారాష్ట్రలో శివసేనలా రాష్ట్రంలో టిఆర్ ఎస్ తయారైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications