లోకేష్ నియోజకవర్గానికి కేంద్రం గుడ్ న్యూస్..!
గుంటూరు జిల్లా మంగళగిరికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఓ కీలక సమస్యకు కేంద్రం పరిష్కారం చూపింది. అంతే కాదు పూర్తిగా నిధులు భరించేందుకూ ముందుకొచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఖర్చుపెట్టకుండానే ఈ సమస్య పరిష్కారం కాబోతోంది. గుంటూరు ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఇది సాధ్యమైంది.
గుంటూరు నగరంలో తాజాగా మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చింది. దీంతో గుంటూరు నగర వాసులకు ట్రాఫిక్ నుంచి విముక్తి కలిగింది. ఇప్పుడు ఇదే క్రమంలో మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నంబూరు - మంగళగిరి ఆర్ఓబికి కేంద్రం 129 కోట్లు మంజూరు చేసింది. 4 వరుసలుగా నిర్మించే ఈ ఆర్వోబీకి రూ.129.18 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఈ వంతెనకు అయ్యే ఖర్చులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించబోతోంది.

నంబూరు-మంగళగిరి మధ్య రైల్వే లెవెల్ క్రాసింగ్ నెంబర్ -14ను రూ.129.18 కోట్ల నిధులతో నాలుగు వరుసల ఆర్వోబీగా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి రూపుదిద్దుకోనున్న క్రమంలో ఈ ఆర్వోబీ నిర్మాణం ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఇప్పటికే కేంద్రమంత్రి పెమ్మసాని గుంటూరు ఎంపీ సీటు పరిధిలో కేంద్రం నుంచి రావాల్సిన ప్రతీ రూపాయి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రమంత్రిగా తనకు ఉన్న పరపతితో ఇప్పటికే నాలుగు ఆర్వోబీలు తీసుకొచ్చిన పెమ్మసానికి 9 నెలల కాలంలో ఇది ఐదో ఆర్వోబీ కావడం విశేషం.












Click it and Unblock the Notifications