బాబు ఈ-కేబినెట్‌పై కేంద్రం ఆరా, లోకేష్ సీక్రెట్ సర్వే!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నిర్వహించిన ఈ-కేబినెట్ సమావేశం పైన కేంద్ర ప్రభుత్వం ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం దేశంలోనే తొలి ఈ-కేబినెట్ సమావేశంగా ఈ భేటీ చరిత్ర సృష్టించింది.
ఐపాడ్‌లు, పవర్ పాయింట్ ప్రజంటేషన్ సాయంతో దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన కాగిత రహిత మంత్రివర్గ సమావేశం. ఈ కేబినెట్ సమావేశం ద్వారా ఏపీ సర్కార్ అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని పైన పీఎంవో ఆరా తీసింది. ఈ-కేబినెట్ పైన పీఎంవో ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకుందని సమాచారం. అలాగే పూర్తి వివరాలు కోరినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన అన్ని పార్టీల బాధ్యత
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం పత్రికా సంపాదకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన అన్ని పార్టీల బాధ్యత అని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించిపెడతానని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారన్నారు.
చంద్రబాబు సర్వే చేయించారా?
చంద్రబాబు ప్రభుత్వం పాలన మంగళవారంతో వందరోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భాన్ని ప్రభుత్వ పని తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి చంద్రబాబు సర్వేను చేయిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ బాధ్యతను తనయుడు నారా లోకేష్‌కు అప్పచెప్పారని అంటున్నారు.
టీడీపీ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోందని తెలుస్తోంది. దీని కోసం 40 ప్రశ్నలతో కూడిన సర్వే పత్రాన్ని లోకేష్ టీం రెడీ చేసిందంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని సగం జిల్లాల్లో సర్వే పూర్తయిందని, మరో రెండు మూడు రోజుల్లో మిగతా జిల్లాల్లో కూడా సర్వే పూర్తవుతుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications