ఏం జరుగుతోంది: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్‌పై కేంద్రం ఆరా
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంగళవారం నాడు రెండు ఎన్‌కౌంటర్ల పైన కేంద్రం ప్రభుత్వం ఆరా తీసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ నేతృత్వంలో అధికారుల సమావేశం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలతో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా చర్చించారు. నివేదికలివ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎన్‌కౌంటర్‌లతో దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే. సూర్యాపేటలో ఇద్దరి పోలీసులను ఉగ్రవాదులు హత్య చేయడం, ఆ తర్వాత జానకీపురంలో సిమి ఉగ్రవాదులను కాల్చి చంపడంతో తెలంగాణ వణికింది. నల్గొండ, వరంగల్ జిల్లాలు సిమి ఉగ్రవాదుల భయంతో వణికిపోతున్నాయి.

అంతలోనే, మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగర్ల ఎన్ కౌంటర్ జరిగింది. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఉదయం 20మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు మట్టుబెట్టారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇటీవలే 500 వందల మంది కూలీలను ఎర్ర చందనం స్మగర్లు దించినట్లుగా తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం కూడా కాల్పులతో మరోసారి హోరెత్తింది. ఉగ్రవాది వికారుద్దీన్ సహా ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఆలేరు - జనగామ రహదారిలో వీరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. పోలీసుల ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేయడంతో ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications