కేంద్రం ఏం చెప్పింది?-ఏపీకి ఏం ఇచ్చింది: ఏం కావాలి?
హైదరాబాద్/అమరావతి: ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేకుండా రెవెన్యూ లోటుతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, విభజన సమయంలో ఏపీకి కేంద్రం నుంచి అనేక హామీలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సందర్భంగా విభజన చట్టం-2014లో మాత్రం వాటన్నింటినీ పొందుపర్చడం జరగలేదు. ప్రత్యేక హోదా కూడా ఈ కోవలోకే వస్తుంది. దీంతో ఏపీకి విభజన జరిగి రెండున్నరేళ్లు కావస్తున్నా.. చెప్పుకోదగ్గ న్యాయం జరగలేదనే అభిప్రాయం అన్ని వర్గాల్లో ఉంది.
కాగా, రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో నాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయి. ఇప్పటివరకు ఏం చేశారు? తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీతో ఏపీకి ఎంత లాభం? అనే వివరాలు ఒక్కసారి పరిశీలించినట్లయితే..

రెవెన్యూ లోటు
విభజన చట్టంలోని సెక్షన్ 46(2) ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడిన రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేయాలి. ఆడిట్ లెక్కల ప్రకారం ఆ ఏడాది రూ.16,079 కోట్లు రెవెన్యూ లోటుగా తేల్చారు.
కేంద్ర సాయం
ఈ ఏడాదితో కూడా కలిపి మూడేళ్ల కాలంలో ఈ విభాగం కింద రూ.3979.50 కోట్లు ఇచ్చింది. అయితే, కేంద్రం, రాష్ట్రం భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం రెవెన్యూలోటుపై కొన్ని అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. రైతులకు రుణమాఫీని కొత్త పథకంగా కేంద్రం పేర్కొంది. 2012 సంవత్సరానికి సంబంధించి డిస్కంలకు రూ.1500 కోట్లు మంజూరు చేసిన విషయాలు పేర్కొంటూ ఆ మొత్తం రూ.8569 కోట్లు మినహాయించాలని అంటోంది.
అది మినహాయిస్తే ఇక రూ.3529.50 కోట్లే రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సి ఉంటోందనేది కేంద్రం వాదన. రైతు రుణమాఫీగా 3068.35 కోట్లు మినహాయిస్తే ఇంకా రూ.9030.15 కోట్లు రెవెన్యూ లోటు భర్తీ చేయాలని రాష్ట్రం వాదిస్తోంది. 14 ఆర్థిక సంఘం వివరాల ప్రకారం లెక్కించినా 2014-15 సంవత్సరంలో రూ.11,911 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుంది. ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం మినహాయిస్తే ఇంకా రూ.7931.50 కోట్లు రావాల్సి ఉంటుంది.
ప్రస్తుత ప్యాకేజీ
ఇప్పటి వరకూ రూ.3979 కోట్లు విడుదల చేశాం. రెవెన్యూ లోటు లెక్కించే విధానం ప్రకారం కొంత మేరకు భర్తీ చేశాం. మిగిలిన మొత్తాన్ని వాయిదాల్లో ఇస్తాం. ఎంత అనేది ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాం.
కాగా, : రూ.4వేల కోట్లకు వరకూ రావచ్చు.
జాతీయ విద్యాసంస్థలు
13వ షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో జాతీయస్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, పెట్రోలియం విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐఐటీ ఏర్పాటుకు అన్ని విధాల సహకరిస్తాం. ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, బోధనాలయం ఏర్పాటుకు అంగీకారం. ఉద్యాన విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ విపత్తు నిర్వహణ శిక్షణాలయం నెలకొల్పేందుకు హామీ.
కేంద్రం ఏమిచ్చింది..
ఐఐటీ-తిరుపతికి రూ.30కోట్లు, ఐఐఎస్‌ఈఆర్-తిరుపతికి రూ.30 కోట్లు, ఐఐఎం-విశాఖకు రూ.17.65 కోట్లు, ఐఐఐటీ-కర్నూలుకి రూ.15.1 కోట్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయం-లామ్‌కి రూ.85 కోట్లు, ఎయిమ్స్-మంగళగిరికి రూ.10 కోట్లు, ఎన్‌ఐడీ-కొండపావులూరుకి రూ.70.87 కోట్లు కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. ఎన్‌ఐటీ-తాడేపల్లిగూడెం, కేంద్రీయ విశ్వవిద్యాలయం-అనంతపురం, గిరిజన విశ్వవిద్యాలయం-విజయనగరం, పెట్రోలియం విశ్వవిద్యాలయం-విశాఖలకు కేటాయింపులు ప్రకటించినా నిధులు విడుదల కావాల్సి ఉంది.
తాజాగా ఏం ఇచ్చారు:
ఇప్పటికే చాలా వరకూ మంజూరు చేశాం. కార్యకలాపాలు సాగుతున్నాయి. మిగిలిన గిరిజన, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది.

నూతన అమరావతికి కేంద్ర సాయం
సెక్షన్ 94(3) ప్రకారం నూతన రాజధాని అమరావతిలో నిర్మించే రాజభవన్, సచివాలయం, హైకోర్టు, ఉభయసభలు, మంత్రులు, అధికారులు తదితరుల నివాస సముదాయాలు, మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన ఆర్థిక సాయం చేయాలి.
ఇచ్చిందెంత?
మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.2500 కోట్లు.(విజయవాడ, గుంటూరు నగరాల అభివృద్ధికి ఇచ్చిన రూ.1000 కోట్లు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇది రాజధాని గ్రాంటులో లెక్కకు రాదంటోంది. ఆ లెక్కన రూ.1500 కోట్లు.)
రాష్ట్రం అడుగుతున్నది:
రాజధానిలో నిర్మాణాలన్నింటికీ కలిపి రూ.20వేల కోట్లు ఖర్చవుతుంది. వచ్చే మూడు సంవత్సరాల్లో ఏడాదికి రూ.5000 కోట్ల చొప్పున
ప్రస్తుత ప్యాకేజీలో ఇచ్చింది:
రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.2500 కోట్లు నిధులు ఇచ్చాం.
విశ్లేషణ: ఇప్పటి వరకూ ఎంత ఇచ్చామో చెప్పారు. ఆ తర్వాత ఎంత ఇస్తారో చెప్పలేదు.

పోలవరం ప్రాజెక్టు
రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ హామీ- విభజిత 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్ల పాటు ప్రత్యేక రాష్ట్ర హోదా (ఇది 5 ఏళ్లు చాలదని, 10 ఏళ్లు ఇవ్వాలని నాటి రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు కోరారు)
కేంద్రం మాట:
12వ పంచవర్ష ప్రణాళిక 2017 మార్చితో ముగుస్తుంది. ఇక మీదట 13వ పంచవర్ష ప్రణాళిక ఉండదు. ఇదివరకటి సూత్రాల ప్రకారం మొత్తం వార్షిక ప్రణాళికలో 1/3వ వంతు ప్రత్యేక హోదాగల రాష్ట్రాలకు కేటాయించేవారు. వచ్చే ఏడాది నుంచి ప్రణాళికలు ఉండనందున హోదా ఇచ్చినా ఉపయోగం ఉండదనేది వాదన. దేశవ్యాప్తంగా ఏకరూప పన్నుల విధానం వస్తున్నందున ఏపీకి ప్రత్యేక మినహాయింపులు సాధ్యం కావని అంటోంది.
ప్రత్యేక ప్రణాళిక మద్దతు కింద కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది. ఇందులో 60% గ్రాంటుగా ఉంటుంది. అదే ప్రత్యేక హోదా రాష్ట్రాలకు 90%గ్రాంటుగా ఉంటుంది. ప్రత్యేకహోదా వల్ల అదనంగా వచ్చే 30% ఇస్తామని కేంద్రం అంటోంది. విదేశీ ఆర్థిక సాయం కింద వచ్చే మొత్తంలో 90% గ్రాంటుగా వస్తుంది.
తాజాగా చెప్పింది:
ప్రత్యేక హోదా ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హోదా వస్తే వచ్చే 30% నిధుల్ని వేరే రూపంలో సాయంగా భర్తీ చేస్తామని ప్రకటించారు.
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ
చట్టంలో ఏముంది?:
క్షన్ 46(3) ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ. రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ వెనుకబడిన జిల్లాలకు కేబీకే, బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పటివరకు ఇచ్చింది:
ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఈ మూడు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి ఇంతవరకు రూ.1050 కోట్లు ఇచ్చారు.
రాష్ట్రం కోరుతున్నది:
బుందేల్‌ఖండ్, కేబీకే( కోరాపుట్-బొలంగీర్-కలహండి) ప్యాకేజీ తరహాలో 10 ఏళ్ల పాటు ఏడాదికి రూ.1000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జిల్లాలకు కలిపి ఏడాదికి రూ.350 కోట్లే ఇస్తున్నారు.
తాజా ప్యాకేజీలో ఇచ్చింది: ఈ ప్యాకేజీ ఇక మీదటా కొనసాగుతుంది.
కాగా, : ప్యాకేజీలో ప్రకటించకపోయినా ఏడాదికి జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు
సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకుంటానని పేర్కొంది. అవసరమైన అన్ని అనుమతులకు తామే బాధ్యులమని పేర్కొంది.
కేంద్రం ఇచ్చింది: 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఇంతవరకు రూ.835 కోట్లు కేంద్రం ఇచ్చింది.
రాష్ట్రం ఏం కోరుతోంది:
2014 తర్వాత పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.1804 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంది. పదకొండో ప్రణాళిక ప్రకారం జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10శాతం నిధులు భరించాల్సి ఉంటుంది. ఆ ప్రకారం నిధులు ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది.
ఈ ప్రాజెక్టుకు తాజా కాగా, ల ప్రకారం మొత్తం రూ.27 వేల కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇప్పటివరకు చేసిన ఖర్చు మినహాయిస్తే మరో 20 వేల కోట్లు అవసరమవుతుంది. ఈ నిధులు కేంద్రం ఇచ్చేలా విభజన చట్టంలోనే పేర్కొన్నారు. సకాలంలో కేంద్రం నిధులు ఇవ్వకపోవడమే అసలు సమస్య.
తాజాగా చెప్పిందేమిటి:
పోలవరం ప్రాజెక్టు ఎవరు నిర్మించాలి, నిధుల చెల్లింపు విషయంలో స్పష్టత ఇచ్చింది. 1 ఏప్రిల్ 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పెట్టిన వ్యయాన్ని తిరిగి ఇస్తామని ప్రకటించింది.
కాగా, : కేంద్రం, రాష్ట్ర వాటాలపై వివిధ కోణాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో విభజన తర్వాత మొత్తం వ్యయాన్ని తాము భరిస్తామని కేంద్రం అధికారికంగా తొలిసారి చేసిన ప్రకటన ఇది. ఈ నిర్ణయం వూరటనిస్తున్నా తదనుగుణంగా నిధులువిడుదల చేస్తేనే ప్రయోజనం. ఇప్పటికే రూ.1800 కోట్లకు పైగా రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు రావాల్సి ఉంది.

పారిశ్రామిక రాయితీలు
సెక్షన్ 94(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి.
రాష్ట్రం వాదన:
కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు సంబంధించి పదేళ్ల పాటు ఎక్సయిజ్ సుంకంలో పూర్తి రాయితీ. 100 శాతం ఆదాయం పన్ను మినహాయింపు. అయిదేళ్ల తర్వాత కంపెనీలకు 30శాతం, కంపెనీయేతర సంస్థలకు 25శాతం పన్ను రాయితీ. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల తరహాలో పదేళ్ల పాటు 100శాతం సెస్, వ్యాట్, ఆదాయ, సేవా పన్నుల మినహాయింపు కోరుతోంది.
ఏమిచ్చింది: ఇంతవరకు ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి ఏదీ రాలేదు. వీటికి అవసరమైన ఏర్పాట్లు చేయలేదు.
ప్రస్తుత ప్యాకేజీలో ఇచ్చింది: ఇప్పటికే రెండు రకాల రాయితీలు ఇచ్చినట్లు ప్రస్తావన. మిగిలినవి త్వరలో వెల్లడిస్తామని ప్రకటన.
మౌలిక సదుపాయాల కల్పన
దుగరాజపట్నం నౌకాశ్రయాన్ని దశలవారీగా ప్రధాన నౌకాశ్రయంగా అభివృద్ధి. 2018కి తొలి దశ అభివృద్ధి పూర్తి. కడప జిల్లాల్లో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, అందుకు అవసరమైన పరిశీలన. ఐఓసీ/హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంపెక్స్ ఏర్పాటు. విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక నడవా అభివృద్ధి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్‌కి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు.
కాగా, దుగరాజపట్నం ప్రస్తావన లేదు. కడప ఉక్కు కర్మాగారం అధ్యయన దశలో ఉన్నట్లు చెప్పారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక నడవాలు పరిశీలనలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే జోన్ ఇచ్చే అంశంపై పరిశీలన చేసి కేటాయిస్తామని హామీ. ఈ అంశం రైల్వే మంత్రి సురేష్ ప్రభు చూస్తున్నారని వెల్లడి. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, ప్రాజెక్టులు, రావాల్సిన నిధులపై కావాల్సినంత స్పష్టత లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.












Click it and Unblock the Notifications